వేసవి వచ్చేసింది. బయట ఎండకి ముఖం నల్లగా మలమల మాడిపోతుంది. అందువల్ల ఇలా ఎండకి ఫేస్ జిడ్డుగా, నల్లగా మారినా ఇంట్లోనే కొన్ని ఫేస్ మాస్కులతో స్కిన్ ను గ్లోయింగ్ గా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటో, నిమ్మకాయ ఫేస్ మాస్
ముందుగా టమాటా ను ప్యూరీగా చేసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసి ఫేస్ కి మెడకు అప్లై చేయాలి. అలా చేసిన తర్వాత 20 నిమిషాల పాటు మాస్క్ ను అలాగే ఉంచాలి. అనంతరం చల్లటి నీళ్లతో ముఖాన్ని కడగాలి. తద్వారా ఫేస్ బ్రైట్ గా మారుతుంది.
పసుపుతో ఫేస్ మాస్
టేబుల్ స్పూన్ పసుపులో మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. దాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఉంచాలి. అనంతరం నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ఫేస్ గ్లో గా వస్తుంది అంతేకాకుండా మొటిమలు మచ్చలు దూరం అవుతాయి.
అరటిపండు పెరుగు మాస్క్
మొదటగా అరటిపండును బాగా క్రష్ చేయాలి. తర్వాత దానిలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేయాలి. అలాగే మరో టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. దాన్ని ముఖానికి అప్లై చేసి బాగా డ్రై అయ్యేవరకు ఉండాలి. అలా అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీళ్లతో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే ఫేస్ చాలా గ్లో గా ఉంటుంది.