anil ravipudi: మెగాస్టార్ సినిమాకు అనిల్ భారీ రెమ్యూనరేషన్.. ఎంతో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే!

అనిల్ రావిపూడి.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక్క ఫెయిల్యూర్ లేకుండా.. తీసిన ప్రతి సినిమాను హిట్టు కొట్టుకుంటూ ముందుకు పోతున్న దర్శకులలో ఈయన ఒకరు. ఇప్పటివరకు దర్శకుడుగా ఆయన తీసిన ఎనిమిది సినిమాలు సూపర్ హిట్ అయినవే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సైతం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఏకంగా బాక్సాఫీస్ నే షేక్ చేసింది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో అనిల్ రావిపూడి క్రేజ్ మారిపోయింది. అతడి క్రేజ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిపోయిందండోయ్. త్వరలో అతడు చేయబోతున్న చిరంజీవి సినిమాకి కోట్లకు కోట్లు తీసుకుంటున్నాడట.

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఓ మూవీ ఈవెంట్లో తెలిపారు. ఆ సినిమా ఫుల్ కామెడీగా ఉంటుందని కడుపుబ్బ నవ్వుకుంటారని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ సంస్థ అధినేత సాహుగారపాటి నిర్మిస్తున్నారు. అలాగే చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల కు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భాగస్వామిగా ఉంది.

ఈ సినిమాపై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు 25 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ను అనిల్ తీసుకున్నాడట. ఈ విషయాన్ని సినిమా యూనిట్ సన్నిత వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

దీంతో తెలుగులో అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శకులలో మొదట రాజమౌళి పేరు వినిపిస్తుంది. ఆయన తర్వాత సుకుమార్, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను వంటి దర్శకులు ఉన్నారు. ఇప్పుడు ఆ దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి కూడా చేరినట్లే అని అనిపిస్తుంది.

తరవాత కథనం