NTR-NEEL: ఎన్టీఆర్-నీల్ యాక్షన్ షురూ.. పూనకాలు తెప్పిస్తున్న ఫొటో!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అందర్నీ బాగా అలరించింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ కావాల్సింది. కాని అని వారి కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ మేకర్స్ నందమూరి ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిపారు.

ఈ మేరకు ఓ ఫోటో రిలీజ్ చేశారు. అందులో ఓ భారీ యాక్షన్ చిత్రీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ షూటింగ్ ను నిన్న హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో మొదలుపెట్టినట్లు నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ప్రకటించింది. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ సైతం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపాడు.

ఈ షూటింగ్లో 2 వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక భారీ ఎపిసోడ్ షూట్ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ షూటింగ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ నటించడం లేదు అని తెలుస్తోంది. నెక్స్ట్ షెడ్యూల్లో ఆయన పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేసేందుకు మేకర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రా న్ని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్, నవీన్, రవిశంకర్, హరికృష్ణ కొసరాజు కలిసి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది.

తరవాత కథనం