Black Coffee : ఇట్స్ అమేజింగ్.. బ్లాక్ కాఫీతో లివర్ సమస్యలు దూరం.. రోజుకు రెండే!

చాలామంది బ్లాక్ కాఫీని తాగడానికి ఇష్టపడరు. కానీ బ్లాక్ కాఫీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్లాక్ కాఫీ తీసుకుంటే లివర్ సమస్యలను దూరం చేసుకోవచ్చని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

అయితే దీన్ని సరైన మోతాదులో తీసుకోవాలని.. మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు. జాన్స్ హపికిన్ నివేదిక ప్రకారం.. రోజుకు రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగాలని తెలిపింది. దీనివల్ల కాలేయ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని.. సంబంధిత అనేక వ్యాధులు తగ్గుతాయని తెలిపింది.

ఈ బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కాలేయ వాపు నష్టం తగ్గించి లివర్ ని రక్షించడంలో ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రమాదాన్ని దాదాపు 71 శాతం తగ్గిస్తుందని నివేదిక చెబుతుంది. అలాగే బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా కంట్రోల్ అవుతాయట.

అంతేకాకుండా కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని.. కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును క్రమక్రమంగా నియంత్రిస్తుంది. గుండె సమస్యలను దూరం చేయడంలో బ్లాక్ కాఫీ ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటితోపాటు టైప్ టు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా బరువును కంట్రోల్ చేయడంలో బ్లాక్ కాఫీ ఎంతగానో సహాయపడుతుంది.

తరవాత కథనం