పాకిస్తాన్ ఆతిథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ఇందులో భాగంగానే నిన్న దక్షిణాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ని దక్షిణాఫ్రికా ఘనంగా మొదలుపెట్టింది. దాదాపు 107 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. మొదట ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ నమోదు చేసింది.
6 వికెట్లకు 315 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ లో రీకిల్ టన్ అట్రాక్షన్ గా నిలిచాడు. అద్భుతమైన ఆట తీరు కనబరుస్తూ స్టేడియంలో జోష్ నింపాడు. అతడు 106 బంతుల్లో 103 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రికిల్ టన్ అందుకున్నాడు. అలాగే బవుమా (58), వండర్ డసేన్(52), మార్ క్రమ్ (52*) సత్తా చాటరు.
ఇలా మొత్తంగా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా 315 పరుగులు చేసింది. ఇక ఈ భారీ లక్ష్య చేదనకు దిగిన ఆఫ్గానిస్తాన్ ఆరంభం నుంచి తడబడింది. అతి తక్కువ సమయంలోనే వికెట్లు కోల్పోయింది. వచ్చిన ప్రతి ఒక్క బ్యాటరు చేతులెత్తేశారు. రహమత్ షా ఒక్కడే పోరాడాడు. 92 బంతుల్లో 90 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్స్ చేతులెత్తేయడంతో ఆఫ్గాన్ మ్యాచ్ ను చేజార్చుకుంది.
43.3 ఓవర్లలో 208 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ అలౌట్ అయింది. ఇదిలా ఉంటే ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీలో రసవత్తర పోరు ఉంది. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ స్టార్, కమీన్స్, హేజిల్ వుడ్ గాయాల కారణంగా దూరమయ్యారు. మరి ఇవాళ జరగబోయే ఈ పోరులో ఎవరు విజేతగా నిలవనున్నారో చూడాలి.