గత ఏడాది కంటే ఈ ఏడాది వేసవి తొందరగానే వచ్చేసింది. ఉదయం కాగానే ఎండ తన ప్రతాపం చూపిస్తుంది. ఇక వేసవిలో కర్బూజా పండుకు మంచి డిమాండ్ ఉంటుంది. సమ్మర్ లో దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వేడి తాపాన్ని తగ్గించి శరీరంలోనీ చల్లని అనుభూతిని ఇస్తుంది. అయితే చాలామంది ఈ కర్బుజా పండు తినడం లేదా జ్యూస్ చేసి తాగడం వంటివి చేస్తారు. కానీ అందులో ఉండే గింజలు మాత్రం పడేస్తారు.
నిజం చెప్పాలంటే కర్బుజా కంటే దానిలోనీ గింజలకి ఎక్కువ పవర్ అని వైధ్యులు చెబుతున్నారు. 100 గ్రా కర్బూజా సీడ్స్ తీసుకుంటే అందులో ఏడు శాతం హెల్తీ కార్బోహైడ్రేట్లు, ఒకటికంటే తక్కువ కొవ్వు, రెండు శాతం ప్రోటీన్లు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు మెగ్నీషియం, జింక్, విటమిన్ ఏ ఈ సి వంటి ఖనిజాలు ఇందులో ఉంటాయని అంటున్నారు. ఈ సీడ్స్ తో కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.
బిపి కంట్రోల్
కర్బూజా పండు తింటే రక్తపోటు కంట్రోల్ అవుతుందని అంటున్నారు. కర్బూజా గింజల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బీపీని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
కర్బుజా గింజలు తింటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అది మాత్రమే కాకుండా శరీరంలోని టాక్సిన్ లను బయటకు పంపడంలో బాగా సహాయపడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ ను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది.
మెరిసే స్కిన్
కర్బుజా సీడ్స్ తో ముడతలు మొటిమలు దూరం అవుతాయి. స్కిన్ కి యవ్వనమైన లుక్ అందించడంలో ఈ గింజలు ఎంతగానో సహాయ పడతాయి. ఎన్నో చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
కంటి ఆరోగ్యం
కంటి ఆరోగ్యం సురక్షితంగా ఉండాలంటే డైట్ లో కర్బూజా సీడ్స్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ ఏ అందత్వం సమస్యలను దూరం చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. ఇవి కళ్ళు ఆరోగ్యానికి సహాయం చేస్తాయి.