సుహాస్ ఈ మధ్యకాలంలో హీరోగా దూసుకుపోతున్నాడు. చేసిన ప్రతి సినిమా హిట్ పడడంతో వెనక్కి తిరిగి చూడటం లేదు. గత ఏడాది ఏకంగా ఆరు సినిమాలు తీసి ప్రేక్షకులను విపరీతంగా అలరించాడు. తన సినీ కెరీర్ మొదట్లో హీరో ఫ్రెండ్ గా చేశాడు. ఎక్కడైనా చిన్న పాత్ర ఉంటే చాలు అనుకున్నాడు. ఆ తర్వాత విలన్ గా కూడా చేశాడు. అలా అతడి నటన నచ్చి హీరోగా ప్రమోషన్ వచ్చింది.
దీంతో తొలి మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నాడు. అక్కడినుంచి వరుస సినిమాలతో మళ్ళీ వెనక్కి చూడలేదు. ఈ ఏడాది సుహాస్ లైన్ అప్ లో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఓ భామ అయ్యో రామ అనే సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో సుహాస్ సరసన మాళవిక మనోజ్ హీరోయిన్గా నటిస్తోంది. రామ్ గోధల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ ఊహించలేని అప్డేట్ ను అందించారు. ఎందరో స్టార్ హీరోలతో హిట్లు కొట్టిన డైరెక్టర్ హరిశ్ శంకర్ మళ్లీ యాక్టింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. సుహాస్ కొత్త సినిమాలో అతడు ఓ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది.
ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మూవీ యునిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో హరీష్ శంకర్ సెట్ లోకి వచ్చి కంగారుగా మానిటర్ దగ్గర మైక్ పట్టుకుని కూర్చోవడం చూడొచ్చు. దీంతో డైరెక్టర్ వచ్చి ఈసారి మీరు కెమెరా వెనక కాదు కెమెరా ముందు ఉండాలి అంటూ హరిశ్ శంకర్ కు చెప్పాడు. వెంటనే హరీష్ శంకర్ స్క్రిప్ట్ పేపర్లు తీసుకొని కెమెరా ముందుకు వెళ్లాడు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టెంటా వైరల్ గా మారింది. అయితే హరీష్ శంకర్ నటుడుగా కనిపించడం ఇది తొలిసారి కాదు. గతంలో అందరివాడు, నిన్నే ఇష్టపడ్డాను, నేనింతే, సమ్మోహనం వంటి ఎన్నో సినిమాల్లో సైడ్ రోల్స్ చేశారు. చూడాలి మరి ఈ సినిమాలో అతడి పాత్ర ఎలా ఉంటుందో.