Kollagottinadhiro: పవన్ కళ్యాణ్ మనసు ‘కొళ్లగొట్టినాదిరో’.. సాంగ్ బంపర్ అదుర్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం హరిహర వీరమల్లు. ఎం ఎం రత్నం సమర్పణలో మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఎవరు ఊహించని విధంగా ఈ చిత్రం ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కొల్లగొట్టినాదిరో అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట వినడానికి చాలా అద్భుతంగా ఉంది.

ఈ సాంగ్ తో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. సాంగ్ మొదటి నుంచి ఆఖరి వరకు మంచి బీట్ తో ఆకట్టుకుంటుంది. అనసూయ, పూజిత పొన్నాడ డాన్స్ ఈ సాంగ్ హైలెట్ గా నిలిచాయి. కీరవాణి స్వరపరిచిన ఈ సాంగ్ సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సాంగ్ విని ఎంజాయ్ చేయండి.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. అందులో హరిహర వీరమల్లు ఒకటి. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎప్పుడో పట్టాలెక్కన ఈ సినిమా ఇప్పటివరకు షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు. దానికి కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడమే.

అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలిసింది. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు చూస్తే అందరికీ అర్థం అయిపోయి ఉంటుంది. మీసాలు తిరిగిన వీర యోధుడిలా ఆ పోస్టర్లో పవన్ కనిపించాడు. కత్తి సాము కర్ర సాముతో సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తించాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. మాట వినాలి అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేయగా సినీ సినీ ప్రియుల్ని బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ సాంగ్ పవన్ కళ్యాణ్ స్వయంగా పడడంతో అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు  రెండో సాంగ్ రిలీజ్ చేసి మరింత బజ్ క్రియేట్ చేశారు.

తరవాత కథనం