గత ఏడాది విడుదలైన ఫుల్ కామెడీ అండ్ ఎంటర్టైనర్ మూవీ మ్యాడ్ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక చిన్న సినిమాగా విడుదలైన మ్యాడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. భారీ కలెక్షన్లతో దుమ్ము దులిపేసింది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సహా మరికొందరు కలిసి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది.
థియేటర్లలో ఈలలు గోళ్ళతో అబ్బురపరిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కేసింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, సాంగ్ విడుదలై అబ్బురు పరిచాయ్. కళ్యాణ్ శంకర్ ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్ లెవెల్లో తెర్కెక్కిస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ యూనిట్ అదిరిపోయే అప్డేట్ అందించింది. ఆడియన్స్ను సర్ప్రైజ్ చేసేలా టీజర్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ లో కామెడీ మరింత పేలింది. పొట్ట చెక్కలయ్యేలా ఎంటర్టైనర్ గా ఉంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కామెడీ అదిరిపోయిందని చెప్పాలి.
మధ్య మధ్యలో వన్ లైనర్స్ కామెడీతో కడుపుబ్బ నవ్వించేశారు. మొత్తంగా టీజర్ చూస్తుంటే లడ్డు గాని పెళ్లిచూట్టు స్టోరీ తిరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.