“సంక్రాంతికి వస్తున్నాం” ప్రియులకు గుడ్ న్యూస్.. కొత్త సీన్ లతో రచ్చ రచ్చే!

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా వెంకీమామ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించి అదరగొట్టేశారు. ఇక ఈ చిత్రం ఓటీటీకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ అందించారు.

 

థియేటర్‌లో ఈ సినిమా రన్ టైం కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలని డిలీట్ చేశారు. అయితే త్వరలో ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమాలో కట్ చేసిన సీన్లు యాడ్ చేస్తే బావుంటుందని మూవీ టీమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీలో మీనాక్షి చౌదరి, వెంకటేష్‌ల మధ్య కొన్ని సన్నివేశాలను యాడ్ చేస్తున్నట్లు టాక్ వినిస్తోంది. అంతేకాకుండా మీనాక్షి, ఐశ్వర్యల మధ్య కూడా కొన్ని కామెడీ సన్నివేశాలను యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

 

ఇకపోతే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 1 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటు టీవీల్లో కూడా వచ్చేందుకు ఈ సినిమా రెడీ అయింది. ప్రముఖ టీవీ ఛానెల్ జీ తెలుగులో ప్రసారం కానుంది. అయితే ఈ సినిమా ఓటీటీ కంటే ముందే టీవీల్లోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

తరవాత కథనం