పాక్ జట్టు చాలా ఘోరం.. మాజీ క్రికెటర్ ఫైర్!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో పాక్ ఓడిపోవడంతో ఆ దేశ మాజీ క్రికెటర్లు తన ప్లేయర్లపై భగ్గుమంటున్నారు. ఈ మేరకు ఆ దేశ లెజెండరీ ఆల్ రౌండర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇందులో భాగంగా ఆడలేక పోతున్న సీనియర్లను జట్టునుంచి తప్పించాలని.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఈ మేరకు పీ సి బి, సెలెక్టర్ల పనితీరును తప్పుపట్టాడు. పాకిస్తాన్ ప్లేయర్ల బౌలింగ్ చాలా ఘోరంగా ఉందని వ్యాఖ్యానించాడు.

గత ఐదు మ్యాచ్ లలో తమ బౌలర్లంతా 60 సగటుతో 24 వికెట్ లు మాత్రమే పడగొట్టారని అన్నాడు. ఒమాన్ సహా వన్డేలాడే 14 మ్యాచ్ లలో అత్యంత దారుణమైన బౌలింగ్ ఉన్న రెండో జట్టు పాకిస్తానే అని అన్నాడు. ఈ టీమును చూసి పీ సి బి చైర్మన్ ఎంతలా నిరాశ చెందాడో వివరించాడు.

పాకిస్తాన్ టీమును చూసి ఆయన అవసరమైతే మార్చాలని కోరాడు అని తెలిపాడు. దీని బట్టి చూస్తే సెలక్షన్ ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవాలి కానీ తీవ్రస్థాయిలో మండి పడ్డాడు. ఓటమికి కెప్టెన్ కూడా బాధ్యత తీసుకోవాలని అన్నాడు.

పాకిస్తాన్ జట్టు 18 ఓవర్ లు బౌలింగ్ చేయగానే.. అభిమానులంతా మైదానాన్ని వీడటం గమనించాను అని తెలిపారు. దేశ చరిత్రలో ఇలాంటి సన్నివేశాలు తాను ఎప్పుడూ చూడలేదని వసీం అక్రమ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టెంట సంచలనంగా మారాయి.

తరవాత కథనం