ఒకప్పుడు అమ్మాయిలు తమ పెళ్లి గురించి కలలు కంటూ పెరిగేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకు.. వివాహం అనేది చేయవలసిన పనుల జాబితాలో కూడా చేర్చబడలేదు. చాలా మంది అమ్మాయిలకు పెళ్లి ప్రాధాన్యత చివరి స్థానంలో ఉంది. అయితే వివాహం గురించి అమ్మాయిల ఆలోచనను మార్చడానికి కాలక్రమేణా ఏమి మారింది? అనే విషయానికొస్తే.. అమ్మాయిలు పెళ్లి నుండి పారిపోవడానికి 4 కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- నేటి మహిళలు గతంలో కంటే ఎక్కువ విద్యావంతులు, ఆర్థికంగా స్వతంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మహిళలు తన కెరీర్‌లో విజయం సాధిస్తున్నారు. తన ఖర్చులను తానే భరిస్తున్నారు. దీని వల్ల తమకు జీవితాంతం ఏ పురుషుడు అవసరం లేదని వారు భావిస్తున్నారు. వారు ఎటువంటి లిమిట్స్ లేకుండా తమ జీవితాన్ని తమ ఇష్టానుసారం జీవించడానికి ఇష్టపడుతున్నారు.
- వివాహం తర్వాత ఒక స్త్రీ గుర్తింపు ఆమె భర్త, పిల్లలతో ముడిపడి ఉంటుంది. కానీ ఇప్పుడు మహిళలు తమ సొంత గుర్తింపును సృష్టించుకోవాలని, తమ కలలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నారు. వివాహం తర్వాత తమ వ్యక్తిగత ఆనందాలు దూరమవుతాయని.. అలాగే వారి గుర్తింపు కేవలం భార్య లేదా తల్లిగా మాత్రమే పరిమితం అవుతుందని భయపడుతున్నారు. ఇది కూడా వారు పెళ్లికి నిరాకరించడానికి ఒక కారణం కావచ్చు.
- అలాగే గతంలో ఒక మహిళ సింగిల్‌గా ఉండటం లేదా లేటుగా పెళ్లి చేసుకోవడం వల్ల సమాజం చెడుగా చూసేది. కానీ ఇప్పుడు సమాజం అభిప్రాయాలు మారుతున్నాయి. వివాహం అనేది ఒకరి జీవిత లక్ష్యం కాదని, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అనేక మార్గాలు ఉన్నాయని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు.
- మరీ ముఖ్యంగా వివాహం తర్వాత ఇంటి పనుల భారం అంతా తమపైనే పడుతుందని కొందరు భావిస్తున్నారు. దీంతో తమ కెరీర్‌లో కోరికలను, అభిరుచులను త్యాగం చేయాల్సి వస్తుందని చాలా మంది మహిళలు ఆందోళన చెందుతున్నారు.