ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్ vs ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రన్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. అందులో ఇబ్రహీం జద్రాన్ అద్భుతమైన ఆట తీరు కనబరిచాడు.
కని విని ఎరుగని రీతిలో షాట్లు కొట్టి అదరగొట్టేసాడు. 146 బంతుల్లో 177 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అందులో 12 ఫోర్లు, ఆరు సిక్స్లు ఉన్నాయి. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో ఇబ్రహీం అరుదైన ఘనత అందుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకేట్ 165 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు.
కానీ ఇప్పుడు ఆ రికార్డును ఇబ్రహీం జద్రాన్ బ్రేక్ చేశాడు. ఇక ఇబ్రహీంతోపాటు అజ్మతుల్లా ఒమర్జాయ్ బాగా ఆడాడు. 31 బంతుల్లో 41 పరుగులు చేసి శభాష్ అనిపించాడు. అలాగే మహమ్మద్ నబీ 24 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఇంకా అస్మతుల్లా షాహిద్ 67 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అయితే ఆఫ్గాన్ జట్టు మొదట్లోనే తడబడింది.
కేవలం 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అలాంటి సమయంలో హస్మతుల్లా, ఇబ్రహీం జద్రాన్ కలిసి తమ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. అలా ఆడుతున్న కొద్ది జాదరాన్ పుంజుకున్నాడు. వరుస పరుగులు సాధించాడు.