కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కూలీ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
దీంతో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజల్‌తో పాటు మరెందరో స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీలోని నాగార్జున పాత్ర పై కీలకమైన సన్నివేశాలను వైజాగ్ షెడ్యూల్లో దర్శకుడు కంప్లీట్ చేశాడు.
లేటెస్ట్ షెడ్యూల్ చెన్నైలో ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మేకర్స్ మరో సర్ప్రైజ్ అందించారు. ఇందులో కొత్తగా మరొక హీరోయిన్ను ఎంపిక చేశారు. ఆల్రెడీ ఇందులో శృతిహాసన్ నటిస్తుండగా.. ఇప్పుడు మరో టాల్ బ్యూటీని తీసుకున్నారు.
ఆమె మరెవరో కాదు బుట్ట బొమ్మ పూజ హెగ్డే. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ లో చేస్తుందా లేక మరేదైనా కీలకపాత్రలో నటిస్తుందా అనేది మేకర్స్ చెప్పలేదు. చూడాలి మరి ఏ పాత్రలో నటిస్తుందో.