Sikandar teaser: భారీ యాక్షన్ సీన్లతో సల్మాన్ ‘సికిందర్’ టీజర్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందులో భాగంగా వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏ సినిమా కూడా ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. అయినా వెనక్కి తగ్గకుండా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో సల్మాన్ తో పాటు రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, శర్మన్ జోషి, సత్యరాజ్, ప్రతిక్ బబ్బర్ వంటి నటినటులు కీలక పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ మరో సర్ప్రైజ్ అందించారు. ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. టీజర్ ఆధ్యాంతం అత్యంత అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. టీజర్ లో సల్మాన్ యాక్షన్ ఓ రేంజ్ లో ఉంది. మొత్తం యాక్షన్ అండ్ ఫైట్స్ తో టీజర్ అదిరిపోయింది. రష్మిక తో సల్మాన్ ఖాన్ రొమాంటిక్ కెమిస్ట్రీ వావ్ అనేలా ఉంది.

టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ సినిమా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్ చూసి ఎంజాయ్ చేయండి.

తరవాత కథనం