aaqib javed: మా ప్లేయర్లపై నేనలా మాట్లాడలేదు.. పాకిస్థాన్ కోచ్ క్లారిటీ!

aaqib javed

పాకిస్తాన్ ఆతిథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ అత్యంత రసవత్తరంగా జరుగుతోంది. అయితే ఈ ట్రోఫీలో పాకిస్తాన్ అవమానకరరీతిలో లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఆ జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలయింది. దీంతో నాకౌట్ కు చేరకుండానే టోర్ని నుంచి బయటకు వచ్చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన పాక్.. అన్ని విభాగాల్లోనూ విఫలమైంది.

దీంతో ఆ జట్టుపై పాక్ అభిమానులు, మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి ఆటను తాము ఎప్పుడూ చూడలేదని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ జట్టు తాత్కాలిక కోచ్ అకీబ్ జావేద్.. తమ బ్యాటర్లను అసభ్యకర పదజాలంతో దూషించినట్లు నెట్టెంటా వార్తలు జోరుగా సాగాయి. అయితే ఈ వార్తలపై అకీబ్ జావేద్ స్పందించారు.

తానెప్పుడూ తమ ప్లేయర్లను దూషించలేదని అన్నారు. ఆ వార్తలు అవాస్థమని తెలిపారు. తాను ప్లేయర్లను ఎప్పుడు తిట్టనని.. అసలు అలాంటి సంస్కృతిని తాను నమ్మనని చెప్పుకొచ్చాడు. మన సంస్కృతిలో టీచర్లు, కోచులు తమ విద్యార్థులను తిట్టడం కొట్టడం సాధారణమైన విషయమే అని అన్నాడు. కానీ వాటిని తన నమ్మనని.. ఆటగాలని ఎంతో గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు.

కోచ్ అనేవాడు వారి నైపుణ్యాలను మెరుగుపరచాలి అని.. కావలసిన సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపాడు. దీంతో అతడిపై వచ్చిన గాసిప్ వార్తలకు చెక్ పెట్టాడు. మరోవైపు తమ జట్టులో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు జోరుగా సాగుతున్నాయి. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, కోచ్ అకీబ్ జావేద్ మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కోచ్ ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు కెప్టెన్ కి చెప్పకపోవడం వల్ల రిజ్వాన్ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్లు సమాచారం.

తరవాత కథనం