Skin Care Tips: వాసివాడి తస్సాదియ్యా.. నారింజ తొక్కతో ఇన్ని ప్రయోజనాలా?.. మెరిసే అందం మీ సొంతం!

చాలా మంది అందమైన ముఖం ఏవేవో ఫేస్ క్రీమ్‌లు వాడుతారు. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి సమయంలో నారింజ తొక్కతో అందమైన, ఆరోగ్యమైన చర్మం మీ సొంతం అవుతుందని మీకు తెలుసా?. అవును మీరు విన్నది నిజమే.. నారింజ తొక్క మీ చర్మాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పీల్స్‌లో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని అనేక రకాల సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. నారింజ తొక్కలను ఉపయోగించడం ద్వారా.. చర్మంపై మచ్చలులేని గ్లో కనిపిస్తుంది. అలాగే చర్మంపై ఉన్న నల్లటి చర్మ కణాలు కూడా తొలగిపోతాయి. యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. ఇది కాకుండా.. నారింజ తొక్కలు చర్మంపై జిడ్డును కూడా నియంత్రిస్తాయి. అయితే దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరెంజ్ పీల్, పసుపు

ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికావడం వల్ల ముఖంపై టానింగ్ వస్తుంది. దాన్ని తొలగించడానికి  నారింజ తొక్క, పసుపుతో కలిపి ఫేస్ ప్యాక్‌ను రెడీ చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి ఒక చెంచా నారింజ తొక్క పొడిని తీసుకుని, అందులో చిటికెడు పసుపు, ఒక చెంచా తేనె కలపాలి. ఈ పేస్ట్ ని ముఖం, మెడపై రాయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

నారింజ తొక్క స్క్రబ్

నారింజ తొక్క అద్భుతమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేస్తుంది. దీని కోసం కేవలం 1 టేబుల్ స్పూన్ నారింజ తొక్క పొడి, వాల్‌నట్ పౌడర్, గంధపు పొడిని తీసుకొని మూడింటిని ఒక గిన్నెలో వేసి అందులో రెండు చెంచాల పెరుగు వేయాలి. సరైన రీతిలో రావడానికి నీరు లేదా రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు. అన్నింటినీ బాగా కలపడం ద్వారా స్క్రబ్‌ను సిద్ధం చేసి, మీ ముఖానికి అప్లై చేయాలి. తర్వాత 15 నిమిషాల తర్వాత బాగా కడగాలి.

ఆరెంజ్ పీల్స్, ముల్తానీ మిట్టి

జిడ్డు చర్మం కలిగి ఉన్నవారు నారింజ తొక్క, ముల్తానీ మిట్టితో కూడిన ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయవచ్చు. దీన్ని చేయడానిక ఒక చెంచా నారింజ తొక్క పొడిని తీసుకుని, ఒక చెంచా ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ అవసరాన్ని బట్టి కలపాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖంపై 15 నుంచి 20 నిమిషాల పాటు అప్లై చేయాలి. సగం ఆరిపోయినా కడిగేయొచ్చు. దీని వల్ల డెడ్ స్కిన్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల నల్లటి మచ్చలు, జిడ్డు వంటివి తొలగిపోయి స్కిన్ అందంగా, యవ్వనంగా, ఆరోగ్యంగా మెరుస్తుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రం. దీన్ని ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

తరవాత కథనం