పాకిస్తాన్ ఆతిధ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ఈ ట్రోఫీలో టీమిండియా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించింది. మొదట బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టేసింది. ఓ వైపు బ్యాటింగ్ లోను, మరోవైపు బౌలింగ్ లోను దుమ్ము దులిపేసింది. ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు. దీంతో తొలి విజయం ఖాయమైంది.
ఆ తర్వాత పాకిస్తాన్ తో మ్యాచ్లో అదరహో అనిపించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. ఇలా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ దే అని ఫిక్స్ అయిపోతున్నారు. ఈ తరుణంలో ఓ బాడ్ న్యూస్ వారిని నిరాశకు గురు చేసింది. నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లో రోహిత్ శర్మ బెంచ్ కే పరిమితం కాబోతున్నాడని తెలుస్తోంది.
తొడ కండరాల నొప్పితో రోహిత్ చాలా సఫర్ అవుతున్నాడని సమాచారం. దీని కారణంగానే అతడు నెక్స్ట్ న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్ కు దూరం కాబోతున్నాడని తెలుస్తుంది. ఒకవేళ అతడు బెంచ్ కే పరిమితం అయితే ఆ స్థానంలో ఎవరు వస్తారు అనేది ఉత్కంఠ గా మారింది.
అందుతున్న సమాచారం ప్రకారం అతడు బెంచ్ కి పరిమితం అయితే అతడు స్థానంలో రిషబ్ పంత్ లేదా వాషింగ్టన్ సుందర్ ను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ బాలుకు పరిగెట్టినప్పుడు అతడు తొడ కండరాలు పట్టేసినట్టు తెలిసింది. దీంతో వెంటనే అతడు కాసేపు రెస్ట్ తీసుకొని మళ్లీ గ్రౌండ్లోకి వచ్చాడు.