Ravichandran Ashwin: ఐసీసీపై రవిచంద్రన్ అశ్విన్ సంచలన ఆరోపణలు..!

గతంలో వన్డేల్లో కేవలం ఒకే బాల్ తో ఇన్నింగ్స్ ఆడించారు. దాదాపు 2013-14 వరకు వన్డేల్లో ఇలానే చేశారు. కానీ తర్వాత ఆ రూల్ ని తీసేసారు. ఐసీసీ కొత్తగా కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఆ నిబంధన ప్రకారం.. అప్పటినుంచి వన్డేల్లో రెండు బంతులతో ఇన్నింగ్స్ ఆడించారు. అంతేకాకుండా సర్కిల్ లోపల ఐదుగురు ఫీల్డర్లను అనుమతించారు. దీంతో వన్డేల్లో ఐసీసీ తీసుకొచ్చిన నిబంధనల పై టీమిండియా మాజీ క్రికెటర్, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐసీసీ తీసుకొచ్చిన నిబంధనలతో స్పిన్నర్లకు ముప్పు వాటిల్లిందని అతడు వ్యాఖ్యానించాడు. ఇప్పటికైనా ఆ రూల్స్ తీసేయాలని లేకపోతే వన్డేల మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందని అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ నిబంధన పెట్టినప్పటి నుంచి స్పిన్నర్ల ఆదిపత్యానికి ముప్పు వాటిల్లిందని అతడు పేర్కొన్నాడు.

ముఖ్యంగా భారత స్పిన్ ఆధిపత్యాన్ని నాశనం చేసేందుకే ఇలాంటి రూల్స్ తెచ్చినట్లు తనకు అనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో రివర్స్ స్వింగ్ కూడా కనుమరుగవుతుందని అతడు అన్నాడు. అంతేకాకుండా ఫింగర్ స్పిన్నర్ల ప్రభావం కూడా తగ్గిపోతుందని అతడు ఆవేదన చెందాడు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ కి ముందు తాను వన్డే ఫార్మేట్ గురించి ఆందోళన పడ్డానని తెలిపాడు.

మరోవైపు ప్రస్తుతం టి20 లకు మంచి క్రేజ్ పెరుగుతుందని అన్నాడు. నాలుగు గంటల్లోనే రిజల్ట్స్ రావడంతో ఎక్కువగా క్రికెట్ ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారని అన్నాడు. అలాగే ఈమధ్య టెస్టులకు కూడా ప్రేక్షకాదరణ పెరిగిందని అన్నాడు. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ వంటి టీమ్‌లు దేశవాళీ క్రికెట్లో మార్పులు తీసుకొస్తే టెస్టులు మరింత ఆసక్తికరంగా మారుతాయి అని అతడు తెలిపాడు.

తరవాత కథనం