కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది “గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి.
రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు టి సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పలుగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. మేకర్ తాజాగా అదిరిపోయే అప్డేట్ అందించారు.
నిన్న తమిళంలో విడుదలైన టీజర్ ఓ రేంజ్ లో సిని ప్రియుల్ని, అభిమాను ల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ టీజర్ తమిళ్ లో 30 మిలియన్ల వ్యూస్ తో పరుగులు పెడుతుంది. దీంతో ఇప్పుడు ఈ టీజర్ను తెలుగులో రిలీజ్ చేశారు. ఇందులో అజిత్ కుమార్ పవర్ఫుల్ లుక్ లో కనిపించి అభిమానులను ఫుల్ ఖుష్ చేశాడు.
ముఖ్యంగా ఈ టీజర్ లో నువ్వు ఎంత మంచి వాడివైనా నిన్ను ఈ ప్రపంచం చెడుగా మార్చేస్తుంది అనే డైలాగ్ అదిరిపోయింది అని చెప్పాలి. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, సునీల్, ప్రభు, ప్రసన్న వంటి నటినటులు కీలకపాత్రలో చేస్తున్నారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.