Tips for Glowing Skin: ముఖం తెల్లగా మెరిసిపోవాలంటే.. ఓ సారి ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Tips for glowing skin: ముఖం అందంగా, తెల్లగా, కాంతివంతంగా మెరిసి పోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఇందుకోసం బయట మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. చాలా మంది బ్యూటీ పార్లర్‌కి వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసి ఫేసియల్స్ చేపిస్తుంటారు. కానీ అవి టెంపరరీగా పనిచేస్తాయి గానీ శాశ్వతంగా పనిచేయవు. పైగా వాటివల్ల చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా నాచురల్‌గా ఫేసియల్స్ తయారు చేసుకున్నారంటే.. మంచి ఫలితం ఉంటుంది. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు
బీట్ రూట్
చిన్న టమోటా
బంగాళదుంప
నిమ్మకాయ

తయారు చేసుకునే విధానం..

ముందుగా బీట్ రూట్, బంగాళ దుంప, టమోటా, నిమ్మకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి వడకట్టుకుని అందులో టీ స్పూన్ శెనగపిండి, టీ స్పూన్ పెరుగు కలిపి బాగా మిక్స్ చేసి దీన్ని ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.

ముఖం కాంతివంతంగా ఉండటం కోసం మరొక చిట్కా..
కావాల్సిన పదార్దాలు
వాజ్‌లైన్ టీస్పూన్
ఆలివ్ ఆయిల్ టీ స్పూన్
లెమన్
పసుపు

తయారు చేసుకునే విధానం
ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో వా‌జ్‌లైన్ టీస్పూన్, పసుపు చిటికెడు, ఆలివ్ ఆయిల్ టీస్పూన్, నిమ్మరసం టీ స్పూన్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ముఖానికి మెడకు అప్లై చేయండి. అరగంట తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా ముఖంపై మచ్చలు, మొటిమలు, తొలగిపోయి కాంతి వంతంగా ఉంటుంది. చాలా అందంగా కనిపిస్తారు కూడా.

పసుపు, శనగపిండితో ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి మంచి ఫలితం ఉంటుంది.
కావాల్సిన పదార్ధాలు
శనగపిండి
పసుపు
నిమ్మరసం
పెరుగు
పచ్చిపాలు

తయారు చేసుకునే విధానం
ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ శనగపిండి, రెండు టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ పసుపు, నిమ్మరసం టీ స్పూన్, టీ స్పూన్ పచ్చిపాలు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి అరగంట తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. మీ ముఖం అందంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

 

తరవాత కథనం