ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా నిన్న (ఆదివారం) భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 44 పరుగులు తేడాతో బలమైన కివిస్ జట్టును ఓడించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్కు దిగింది.
ఇందులో భాగంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అందులో శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా 150 నుంచి 200 పరుగులు చేయడం కష్టమే అన్న సమయంలో అతడు ఆదుకున్నాడు. స్టార్ బ్యాటర్లు రోహిత్, గిల్, విరాట్ కోహ్లీ ముగ్గురు అతి తక్కువ సమయంలోనే లోస్కోర్ తో అవుట్ అయ్యారు.
ఆ టైంలో క్రీజ్ లో ఉన్న శ్రేయస్ ఎక్కడా తగ్గకుండా తన ఫామ్ కొనసాగించాడు. మొత్తంగా 98 బంతుల్లో 79 పరుగులు చేశాడు. అతడి తర్వాత హార్దిక్ పాండ్యా సైతం అదరగొట్టేసాడు. 200 తో ఆగిపోతుందనుకున్న భారత్ స్కోర్ ను 250 వరకు తీసుకెళ్లాడు. 45 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇక అక్సర్ పటేల్ కూడా 42 పరుగులతో దుమ్ము దులిపేశాడు.
ఇలా భారత జట్టు 9 వికెట్లు నష్టానికి 200 పరుగులు నిర్దేశించింది. ఇక ఈ టార్గెట్ ను ఛేదించేందుకు న్యూజిలాండ్ స్టాండర్డ్ గానే ఆడింది. కానీ మధ్యలో చాలా తడబడింది. టీమిండియా స్పిన్నర్ల దాటికి తట్టుకోలేకపోయింది. రెండు వికెట్లు నష్టానికి వందకు పైగా పరుగులతో నిలకడగానే ఆడింది. కానీ టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన బౌలింగ్ తో మ్యాచ్ ను తిప్పేసాడు.
5 వికెట్లు తీసి విజృంభించాడు. దీంతో కివీస్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆల్ అవుట్ అయింది. కివీస్ బ్యాటర్లలో కేన్ విలియమ్స్ న్ మంచి బ్యాటింగ్ చేశాడు. 120 బంతుల్లో 81 పరుగులు చేసి సత్తా చాటాడు. అయితే ఒక్కడే పోరాడడంతో న్యూజిలాండ్ కు విజయం దక్కలేదు. మొత్తంగా భారత్ హ్యాట్రిక్ విజయంతో దూసుకుపోయింది. నెక్స్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో మార్చ్ 9న జరగనుంది.