Tips For White Hair: తెల్ల జుట్టు నల్లగా మార్చేందుకు బెస్ట్ టిప్స్ ఇవే.. జీవితంలో తెల్లజుట్టు రాదు.

Tips For White Hair: ఈ రోజుల్లో చాలా మంది తెల్లజుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి దుమ్మూ, ధూళి, సరైన పోషకాహారం తినకపోవడం, కంటి నిండా నిద్ర లేకపోవడం, జన్యు లోపాలు ఇతర కారణాలు కావచ్చు. అయితే చాలా మంది మార్కెట్లో దొరికే హెయిర్ డైలు, రకరకాల హెన్నాలు ఉపయోగిస్తుంటారు. ఇవి కొద్దిరోజులు మాత్రమే పని చేస్తాయి. మళ్లీ యథావిధిగా వచ్చేస్తుంటుంది. పైగా వీటివల్ల చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇవి కెమికల్స్‌తో తయారు చేస్తారు కాబట్టి జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తెల్లజుట్టును మాయం చేసేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వారంటే.. ఖచ్చితంగా మంచి రిజల్స్ట్ మీకు కనిపిస్తాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు
కలోంజీ సీడ్స్
మెంతులు
లవంగాలు
కొబ్బరి నూనె
కాఫీ పౌడర్

తయారు చేసుకునే విధానం
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో మెంతులు, కలోంజీ సీడ్స్, లవంగాలు, కాఫీ పొడర్ వేసి మెత్తగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. అందులో తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి 10 నిమిషాలు మరిగించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరే గిన్నెలోకి వడకట్టుకోండి. ఈ ఆయిల్‌‌‌ను జుట్టు కుదుళ్లకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు మూడు సార్లు చేస్తే సరిపోతుంది. క్రమంగా తెల్లజుట్టు రావడం ఆగిపోవడంతో పాటు.. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్స్ ఉండవు.

తెల్లజుట్టు నల్లగా మార్చేందుకు మరొక చిట్కా..

కావాల్సిన పదార్ధాలు
పసుపు
కొబ్బరి నూనె
మెంతులు
కరివేపాకు

తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి పాన్ పెట్టుకుని.. దానిపై మెంతులు, పసుపు, కరివేపాకు వేసి బాగా నల్లగా మారేంత వరకు వేయించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి వీటిని మిక్సీజార్‌లోకి తీసుకుని మెత్తగా పొడి చేసి ఒక గిన్నెలో తీసుకుని.. అందులో కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది. తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే.

 

 

తరవాత కథనం