Summer Skincare Tips: సమ్మర్‌లో ఈ టిప్స్ ఫాలో అయితే.. చెక్కుచెదరని అందం మీ సొంతం..!

Summer Skincare Tips

Summer Skincare Tips : సమ్మర్ వచ్చేసింది. ఈ సీజన్‌లో సౌందర్య సమస్యలు రౌండప్ చేస్తూ ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ముఖం జిడ్డుగా మారిపోవడం, మొటిమలు, మచ్చలు, స్కిన్ పొడిబారిపోవడం, కమిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక అమ్మాయిలు వారి అందాన్ని రక్షించుకునేందుకు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే సమ్మర్ బ్యూటీ రొటీన్‌పై దృష్టి పెడితే .. చెక్కుచెదరని అందం మీ సొంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖం అందంగా మార్చేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వారంటే.. మంచి ఫలితం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్ రూట్, రోజ్ వాటర్‌తో ఫేస్ ప్యాక్

ముందుగా చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, టీ స్పూన్ బీట్ రసం వేసి బాగా మిక్స్ చేయండి.  ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం అందంగా మెరిసిపోతుంది. ఫేస్‌పై మొటిమలు, మచ్చలు తొలగితాయి. ఓ సారి ట్రై చేయండి.

పెరుగు, కాఫీ పొడితో ఫేస్ ప్యాక్

చిన్న గిన్నె తీసుకుని అందులో అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ కాఫీ పొడి వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి.. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తే.. ముఖంపై ట్యాన్ తొలగిపోయి మిలమిల మెరుస్తుంది.

పెరుగు, శెనగపిండి, పసుపు ఫేస్ ప్యాక్

చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ శెనగపిండి, చిటికెడు పసుపు వేసి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు.. ముఖంపై మురికి, మొటిమలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గులాబీ రేకులు, కమలా పండు తొక్కలతో ఫేస్ సీరమ్

గులాబీ రెబ్బలు, కమలా తొక్కలను ఒక గిన్నెలో తీసుకుని అందులో గ్లాసు వాటర్ పోయాలి. దీన్ని గ్యాస్‌పై పెట్టి 10 నిమిషాలు మరిగించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. చల్లారిన తర్వాత వడకట్టుకుని స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ సీరమ్‌ను ముఖానికి అప్లై చేసి పడుకోండి. తెల్లవారేసరికి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

తరవాత కథనం