Manchu Lakshmi: గత కొంత కాలంగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మోహన్ బాబు, మనోజ్ మధ్య ఆస్తి తగాదాలు దగ్గర మొదలైన ఈ గొడవ సోషల్ మీడియాలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ గొడవ వల్ల మంచు ఫ్యామిలీ విడిపోయిందని, మంచు విష్ణు, మోహన్ బాబు ఒక వైపు, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఒకవైపు అని ఇటీవల వార్తలు గుప్పుమనిపించాయి.
కానీ మంచు లక్ష్మి మాత్రం ఈ విషయంపై వ్యక్తిగతంగా స్పందించడం గానీ, మంచు మనోజ్‌కు సపోర్టు చేయడం వంటవి చేయలేదు. అయితే తాజాగా మంచు మనోజ్, మౌనికల మ్యారెజ్‌డే సందర్భంగా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో విష్ చేస్తూ ఓ పోస్టును రిలీజ్ చేయడంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది.
కాగా మంచు లక్ష్మి చాలా సార్లు మంచు విష్టు కంటే.. మంచు మనోజ్ అంటేనే చాలా ఇష్టమని అనేక సందర్భాల్లో చెప్పింది. అందుకు మనోజ్ ఏం చేసిన లక్ష్మి సపోర్ట్‌గా ఉండేది. ఇక మనోజ్ పెళ్లి విషయంలో కూడా చాలా సపోర్ట్ చేసింది. మంచు మనోజ్‌కు ఇది వరకే వివాహం అయిన సంగతి తెలిసిందే.. వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు.
ఆ తర్వాత రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ టైమ్‌లో పలు కారణాల వల్ల మంచు ఫ్యామిలీ ఈ పెళ్లికి సపోర్ట్ చేయలేదు. మొత్తానికి మంచు కుటుంబం నుంచి లక్ష్మి చొరవ వల్ల మోహన్ బాబు పెళ్లికి హాజరయ్యాడు. కానీ మంచు విష్టు మాత్రం పెళ్లికి కూడా హాజరవ్వకుండా.. కనీసం విషెస్ కూడా చెప్పలేదు.
తాజాగా మంచు లక్ష్మి మంచు మనోజ్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా విషెస్ తెలియజేసింది. Wishing you a lifetime of love, my M&M 🥰✨❤️ @HeroManoj1అంటూ క్యాప్షన్ ఇచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.