Summer Health Tips: వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

Summer Health Tips: వేసవి కాలం వచ్చేసింది. ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరుగుతూనే వస్తున్నాయి. మరి సమ్మర్‌లో మీ శరీరంతో పాటు.. ఆరోగ్యాన్ని కాపాడుకునే కొన్ని టెక్నిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం

ప్రస్తుతం వేసవిలో ఉష్టోగ్రతలు రోజు రోజుకిపెరుగుతున్నాయి. మండే ఎండల నుంచి రక్షణ పొందాలంటే.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. ఇవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నీరు
శరీరాన్ని చల్లబరచడంలో నీరు కీలక పాత్రను పోషిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగి శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు వెళ్తే.. దాన్ని అదే స్థాయిలో భర్తీ చేయాలి. మీకు దాహం వేయకపోయిన  నీటిని తీగాల్సిందే.

కూల్ డ్రింక్స్ వద్దు
వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు కూల్ డ్రింక్స్ ఉత్తమం అనుకుంటారు చాలా మంది. కానీ వాటిని అధికంగా తాగితే శరీరంలో చక్కెర, ఫాస్పరస్, నిల్వలు పెరిగే అవకాశం ఉంది. వీటి బదులు కొబ్బరి నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

అధిక చల్లదనం వద్దు
చల్లని నీరు, పానీయాలతో పోలిస్తే.. అతి చల్లనివి మనల్ని త్వరగా చల్ల బరుస్తాయనని అనుకోవద్దు. బాగా చల్లగా ఉన్నవి తాగితే.. రక్తంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతి చల్లని వాటికి దూరంగా ఉండండి.

పండ్లు, కూరగాయల ఎంపిక
వేసవిలో పండ్లు తినమని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ అందులో కొన్ని శరీరానికి వేడి చేసేవి కూడా ఉంటాయి. కాబట్టి అలా వేడి పండ్లకు దూరంగా ఉండండి.

తాజావి తినండి.
వేసవిలో వీలైనంత వరకు తాజాగా ఉన్నవి తినండి. అంతే కాకుండా ఎక్కువ మొత్తంలో తింటే జీర్ణం కావడం కష్టం కాబట్టి.. తేలికపాటి ఆహారం ఆహారాన్ని తక్కువ మొత్తంలో తినండి.

ఆహారం.
మిగతా కాలంలో పోలిస్తే.. వేసవిలో శరీరానికి అధిక పోషకాలు అవసరం. కాబట్టి భోజనాన్ని మానేయకండి. అదే సమయంలో తేలికపాటి, తక్కువ పరిణామంలో ఆహారం తీసుకోండి.

చన్నీటి స్నానం
వేసవిలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కనీసం రోజుకు రెండు సార్లు అయన స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వదులైన దుస్తులు
వేసవిలో శరీరానికి అతికినట్టు ఉండే దుస్తులు వేసుకుంటే.. గాలి తగలక చెమటలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. సింథటిక్ దుస్తులు కాకుండా నూల్‌తో తయారు చేసినవి వాడితే మంచిది.

తరవాత కథనం