నాచురల్ స్టార్ నాని పలు సినిమాలతో దూసుకుపోతున్నాడు. పెద్ద పెద్ద పరుగులకు పరిగెట్టకుండా.. చిన్న చిన్నగా అదరగొడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గత ఏడాది రెండు మూడు సినిమాలు తీసి మంచి హిట్లు అందుకున్నాడు. కొత్త కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో నాని ఎప్పుడూ ముందుంటాడు.
తాను పడ్డ కష్టాలు ఇంకెవరు పడకూడదని అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం అతడు పలు సినిమాలను లైన్లో పెట్టాడు. ఓవైపు శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన రెండు పార్ట్ లు బ్లాక్ బస్టర్ హిట్లర్ అందుకున్నాయి. ఇప్పుడు మూడో పార్ట్ లో నాని నటిస్తున్నాడు.
మరోవైపు తనకు ఇదివరకు దసరా మూవీ తో బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఆ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ను మేకర్ అందించారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో నాని లుక్ అస్సలు ఊహించలేనట్లుగా ఉంది. ఈ సినిమా నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకి”ది ప్యారడైజ్” అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అత్యంత అద్భుతంగా ఉంది. స్టార్టింగ్ లో రా ట్రుత్, రా లాంగ్వేజ్ అనే డిస్క్లైమర్ తో అర్థం అవుతుంది.. ఇది ఎలా ఉండబోతుందో అని. ఇందులో నాని ఊర మాస్ లుక్ లో అదిరిపోయాడు.
ఇప్పటివరకు క్లాసిక్ సినిమాలతోనే ఆకట్టుకున్న నాని ఇప్పుడు ఈ లుక్ లో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆ చిన్న టీజర్ లో మాస్ డైలాగులతో ఆకట్టుకున్నాడు నాని. ముఖ్యంగా అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అని చెప్పాలి. రెండు జడలు వేసుకుని నాని కనిపించిన లుక్ వేరే లెవల్ అని చెప్పాలి. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఆ టీజర్ లో చెప్పుకొచ్చారు. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఆ టీజర్ చూసి ఎంజాయ్ చేయండి.