Ajinkya Rahane: KKR కొత్త కెప్టెన్‌గా అజింక్య రహానే..

ఐపీఎల్ 2025 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. మార్చి 22 నుంచి మ్యాచ్లు జరగనున్నాయి. వీటి కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ సీజన్ మొదలవుతుందా? అని కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన రెండు వారాల్లోపే ఐపీఎల్ ప్రారంభం కానుంది.

ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను ప్రకటించాయి. కానీ కోల్‌కతా జట్టు మాత్రం ఇప్పటివరకు కెప్టెన్ ప్రకటించలేదు. దీంతో కోల్కతాకు కెప్టెన్ ఎవరా అని అంతా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా రింకు సింగ్ పేరు వినిపించింది. కేకేఆర్ జట్టు కొత్త కెప్టెన్ గా అతడిని ఎంపిక చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి.

ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ పేరు కూడా వినిపించింది. దీంతో వీరిద్దరిలో ఎవరు కెప్టెన్ గా నిలుస్తారు అనేది ఉత్కంఠ గా మారింది. ఈ క్రమంలో ఎవరు ఊహలకు అందని నిర్ణయాన్ని కేకేఆర్ యాజమాన్యం తీసుకుంది. తమ జట్టు కొత్త కెప్టెన్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అజింక్య రహనేకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించంది. ఇందులో భాగంగా వైస్ కెప్టెన్ గా వెంకటేష్ అయ్యర్ ను నియమించింది. ఇదే విషయం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

కాగా అజింక్య రహేనేను ఐపీఎల్ మెగా వేలంలో రెండవ రోజు చివర నిమిషంలో తీసుకున్నారు. రూ. కోటిలకు పైగా అతన్ని కొనుక్కున్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు కెప్టెన్గా చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. మరోవైపు కేకేఆర్ జట్టు ఈసారి కొత్త జెర్సీలతో దర్శనం ఇవ్వనుంది. ఇప్పటికే కేకేఆర్ యాజమాన్యం తమ కొత్త జెర్సీలను ఆవిష్కరించింది. జెర్సీపై మూడుసార్లకు స్థానం కల్పించింది. 2012, 2014, 2024లో కేకేఆర్ జట్టు ఐపీఎల్ ట్రోఫీలను గెలిచింది. దీంతో ఆడు, పోరాడు, గెలువు అనే పేర్లను జెర్సీలపై పెట్టింది. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

తరవాత కథనం