విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వచ్చి విక్టరీ కొట్టేసాడు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఓ రేంజ్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దాదాపు 50 రోజుల రన్ టైం కూడా ఈ సినిమా ఇటీవల పూర్తి చేసుకుంది.
దీన్ని బట్టి చూస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో వెంకీ మామ పండించిన హాస్యానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లతో అబ్బురపరిచింది.
ఏకంగా ఆల్టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. మంచి హిట్ కోసం ఎదురుచూసిన వెంకి మామకు ఈ సినిమా అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. దీంతో వెంకీమామ నెక్స్ట్ సినిమా ఏ జానర్ లో వస్తుందా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వెంకీ మామ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
త్వరలో తాను తీయబోయే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. తదుపరి చిత్రం కూడా మంచి హిట్ అవ్వాలని భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే తన వద్దకు వచ్చిన 20 కథలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత వెంకీ మామ వద్దకు దాదాపు 20 స్టోరీలు వచ్చాయని సమాచారం. కానీ అందులో ఒక్క సినిమాకి కూడా వెంకీ మామ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.
ఏమాత్రం కొద్దిగా బాలేదు అని అనిపించినా నో చెప్పేసినట్టు తెలుస్తుంది. అవతల ఎంత పెద్ద డైరెక్టర్ అయినా అదే పని చేసాడంట. గతంలో ఎఫ్2, ఎఫ్3 సినిమాల హిట్ల తర్వాత శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన సైంధవ్ మూవీ భారీ డిజాస్టర్ గా మిగిలింది.
ఇక ఇప్పుడు కూడా అదే తప్పు చేయకూడదని వెంకీ ఆలోచిస్తున్నాడట. సంక్రాంతి వస్తున్నాం హిట్టు తర్వాత తన నెక్స్ట్ సినిమా కూడా మంచి హిట్ కావాలని అతడు భావిస్తున్నాడట. అందువల్లనే మంచి స్టోరీ కోసం ఎదురుచూస్తూ దాదాపు 20 కథలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి అతడు ఎలాంటి స్టోరీ ను ఎంచుకుంటాడో త్వరలో చూడాలి.