Bobby Deol: ఆనిమల్ మూవీతో అన్ని భాషల వారికి చేరువైన బాలీవుడ్ నటుడు బాబి దేవోల్.. ఆ సినిమాలో హీరోకు సమానమైన ఫిట్‌నెస్‌తో కనిపించి, అందరిని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు వరుస సినిమాలతో విలన్‌గా ఆకట్టుకోవడానికి సిద్దమయ్యారు. వైవిధ్యమైన పాత్రలు ఎంపిక చేసుకుంటూ.. విజయాలతో దూసుకెళుతున్నాడు బాబీ దేవోల్. గతంలో అవకాశాల కోసం తాను ఎదుర్కున్న సమస్యల గురించి ఓ షోలో తెలిపారు. తనకు పని ఇప్పంచండి అంటూ చాలా మంది ఇళ్ల ముందు నిలుచున్నానని గుర్తు చేసుకున్నారు.
విజయాలతో పాటు, తన జీవితంలో ఎదుర్కున్న ఒడిదుడుకుల గురంచి చెప్పుకున్నారు. నేను బాబి దేవోల్.. నాకు పని కల్పించండి అంటూ వారి తలుపులు తట్టా.. మనకు కావాల్సినప్పుడు.. ఎదుటి వారి దగ్గర అడగడంలో తప్పులేదని నా అభిప్రాయం అంటూ ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం సిగ్గు పడాల్సిన పనిలేదన్నారు. ఇప్పుడు కనీసం బాబీ దేవోల్ తనను కలవడానికి వచ్చాడని వారికి గుర్తుండి ఉంటుందని అనుకుంటున్నా అన్నారు.
సినీ ఇండస్ట్రీలో జరిగే పరిణామాలు, అవకాశాల గురించి బాబీ దేవోల్ మాట్లాడారు. తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఉన్న పరిస్థితులతో పోలిస్తే.. ప్రస్తుతం చాలా మార్పులు కనిపిస్తున్నాయన్నారు. అప్పట్లో ఆఫర్లు చాలా రేర్‌గా వస్తుండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఎంతో మంది ఇండస్ట్రీకి వస్తున్నారని వెల్లడించారు. నటీ నటుల సంఖ్య చాలా పెరిగిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.