Hair Growth Tips: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య జుట్టు ఊడిపోవడం. ఇందుకు బయట కాలుష్యం, దుమ్మూ, ధూళి, సరైన పోషకాహారం తినకపోవడం, జుట్టుకు సరైన పోషణ అందకపోవడం.. ఇతర కారణాల వల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. ఈ ఉరుకు పరుగుల జీవితంలో జుట్టును కాపాడుకోవడం ఎంతైన అవసరం. ప్రతిరోజు డైట్‌లో జుట్టుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. అయితే చాలా మంది జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు మార్కెట్లో రకరకాల హెయిర్ ఆయిల్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు.
ఇవి పనిచేస్తాయో లేదో పక్కన పెడితే.. చర్మ సమస్యలతో పాటు, జుట్టు డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్లోనే నాచురల్ పదార్ధాలతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నారంటే.. మంచి ఫలితం ఉంటుంది. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం
కావాల్సిన పదార్ధాలు
కరివేపాకు
మందారం ఆకులు
కలబంద
మందారం పువ్వులు
కొబ్బరి నూనె
ఉల్లిపాయలు
తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో కొబ్బరి నూనె, కలబంద, ఉల్లిపాయ చిన్న ముక్కలు, మందారం పువ్వులు, మందారం ఆకులు వేసి, బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి, వేరే గాజు సీసాలో వడకట్టుకోండి. ఈ హెయిర్ ఆయిల్‌ను ప్రతిరోజు అప్లై చేసుకోవచ్చు.
లేదంటే.. జట్టుకు ఆయిల్ అప్లై చేసి, అరగంట తర్వాత తలస్నానం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఈ హెయిర్ ఆయిల్ జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉపయోగించే పదార్దాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. పైగా చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే.