Summer Skin Care Tips: సాధారణంగా వాతావారణంలో వచ్చే మార్పులు ముఖ సౌందర్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా వేసవిలో వచ్చే ఎండ వల్ల చర్మంపై అనేక మార్పులు కనిపిస్తాయి. చెమటతో చర్మం జిడ్డుగా ఏర్పడటం, పొడిబారిపోవడం, మొటిమలు రావడం, మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమయంలో చర్మ సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందే. లేదంటే ముఖ సౌందర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వారంటే.. మంచి ఫలితం ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కలబంద, విటమిన్ ఇ క్యాప్సూల్స్, రోజ్ వాటర్ ఫేస్‌ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ విటమిన్ ఇ క్యాప్సూల్స్, రోజ్‌వాటర్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తే.. మీ ముఖంపై ట్యాన్ తొలగిపోయి చాలా అందంగా కనపిస్తారు.
బియ్యం పిండి, రోజ్‌వాటర్‌తో ఫేస్‌ప్యాక్
చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ఫేస్‌ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మచ్చలు తొలగిపోయి.. కాంతివంతంగా మెరుస్తుంది.
బొప్పాయి, పెరుగు ఫేస్‌ప్యాక్
చిన్న బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు, టీ స్పూన్ పెరుగు, టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే.. ముఖంపై ట్యాన్ తొలగిపోయి మిల మిల మెరిసిపోతుంది.
పాలు, పసుపు, బియ్యంపిండి ఫేస్ ప్యాక్
చిన్న గిన్నెలో టేబుల్ స్పూన్ బియ్యంపిండి, చిటికెడు పసుపు, పచ్చిపాలు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రెండు వారాలకు ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోయి చాలా అందంగా కనపిస్తారు.