Best Foods For Energy: శక్తి, ఉత్సాహాన్నిచ్చే ఆహారం.. ఇవి తిన్నారంటే ఫుల్ ఎనర్జీతో ఉంటారు తెలుసా..

Best FoodsFor Energy

Best FoodsFor Energy: మనం తినే ఆహారం మన శరీరంపై చాలా ప్రభావం చూపుతుంది. శరీరం పనితీరును ప్రేరేపిస్తుంది. వీటితో పాటు జీర్ణ వ్యవస్థ, మెదడు పనితీరు మెరుగుపడి శరీరానికి శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది.అయితే ఫుడ్ విషయంలో క్లారిటీ ఉండాలి. మనం తీసుకునే ఆహారం శరీరంలో ఎలాంటి ఫీలింగ్స్ కలిగిస్తుందనే విషయాన్ని గమనించాలి. రోజుకో యాపిల్ తీసుకుంటే.. శరీరంలో నిశ్చిలతను దూరంగా ఉంచుతుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. మనం తీసుకునే ఆహారం క్యాలరీలను సరఫరా చేయడం ద్వాదా సమర్ధవంతంగా, బర్న్ చేయడం ద్వారా, మరి కొన్ని సందర్భాల్లో కెఫిన్ పంపిణీ చేయడం ద్వారా శక్తిని అందిస్తాయి.

చక్కని మానసిక స్థితిని కల్పించడానికి, రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి, బ్రెయిన్ కెమిస్ట్రీని ప్రేరేపించడానికి బెస్ట్ ఫుడ్, బెస్ట్ డ్రింక్స్ చాలానే ఉన్నాయి. పిండి పదార్ధాలు, శక్తిని, మానసిక పరిస్థితిని ఉత్తేజపరుస్తాయి. బాడీలో ఫీల్ గుడ్ కెమికల్స్ సెరటోనిన్ సహాయపడుతుంది. ఇవే కాక గోధుమ రొట్టె, బ్రౌన్ రైస్, తృణ ధాన్యాలు ఎంచుకోవాలి. అవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. ముఖ్యంగా స్వీట్లకు దూరంగా ఉండటం మంచిది. జీడిపప్పు, బాదం, పిస్తా పప్పుల్లో ప్రొటీన్స్, మెగ్నీషియం అధిక స్థాయిలో ఉండి, శరీరానికి అవసరమైన శక్తిని, మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి.

అమైనో యాసిడ్స్, థైరోసిన్‌తో కూడిన ప్రొటీన్లు పుష్కలంగా ఉండే, మటన్, చికెన్ తినడం వల్ల శరీరానికి శక్తితో పాటు ఉత్సాహం లభిస్తుంది. మాంసంలో ఉండే బీ 12 విటమిన్ నిద్రలేమి, డిప్రెషన్ నుంచి బయటపడేలా చేస్తుంది. ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్  సాల్మన్ ఫిష్‌లో అధికంగా ఉంటాయి. ఇవి డిప్రెషన్‌‌ను తొలగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

తృణ ధాన్యాలు, ఆకు కూరల్లో కూడా ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో దాని వల్ల లభించే శక్తి, ఉత్సాహం కూడా అంతే ముఖ్యం. అందుకే తీసుకునే ఆహారం శరీరానికి ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతుందనే విషయంలో క్లారిటీ ఉండాలి. బాడీని శక్తివంతంగా మార్చి ఉత్తేజపరిచే రకరకాల ఆహార పదార్ధాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అలాంటి డైట్‌ను ఫాలో అవ్వండి

తరవాత కథనం