Singer kalpana: సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అటు ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్ నిజాంపేటలో వర్టెక్స్ ప్రివిలేజ్‌లోని తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు.
రెండు రోజుల క్రితం కల్పన భర్త చెన్నై వెళ్లారు. ఈ రెండు రోజులు ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. అయితే.. ఈ రెండు రోజుల్లో ఒక్కసారి కూడా ఆమె బయట కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు కల్పన ఇంటికి వచ్చి డోర్ కొట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో డోన్‌ని బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా, బెడ్‌పై కల్పన అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. బెడ్‌పై కొన్ని టాబ్లెట్లు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన భర్త తీరుపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజులుగా ఆమె బయటకు రాలేదు. ఈ రెండు రోజులుగా కల్పనకు ఆమె భర్త కాల్ చేయలేదా? చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదా? 2 రోజుల నుంచి కమ్యునికేషన్ లేకపోతే కల్పన భర్తలో ఎందుక స్పందన లేదు? ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే. అంతేకాదు.. పోలీసులు సమాచారం ఇచ్చే వరకు కల్పన భర్త హైదరాబాద్ రాలేదు. హైదరాబాద్ వచ్చిన ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వాహనంలో ఆయన ముఖం చాటేసిన తీరు కూడా కొంతమేర అనుమానంగానే ఉంది.
కల్పన రిఫ్రెష్‌మెంట్ కోసం కొన్ని మాత్రలు వాడుతున్నారని ఆమె భర్త పోలీసులుకు చెప్పారు. వాటి డోస్ పెరగడంవల్ల ఇలా జరిగిందా అనే అనుమానం కూడా ఉంది. పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతానికి కల్పన కేసులో పోలీసులు ఇంకా కన్‌క్లూజన్‌కు రాలేదు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే విషయం తేలే అవకాశం ఉంది.
కల్పనను చూడటానికి ఆస్పత్రికి పెద్ద ఎత్తున సింగర్లు క్యూ కడుతున్నారు. గీతామాధురి, సునీత, కారుణ్య, సింగర్ శ్రీ కృష్ణ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.