Actress Ranya Rao: ఎయిర్ పోర్ట్‌‌లో రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన హీరోయిన్

Actress Ranya Rao

 Actress Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావు భారీ బంగారంతో పట్టుబడింది. బెంగళూరు ఎయిర్ పోర్టులో దుబాయ్ నుండి వచ్చిన సినీ నటి రన్యా రావు నుండి 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు. అనతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె తరుచుగా దుబాయ్ వెళ్లి వస్తున్నట్టుగా గుర్తించారు. గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లినట్టు గుర్తించారు.

బంగారం అక్రమంగా తరలింపు కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రాన్యా రావ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఆమె వెనక ఎవరున్నారు? ఇంతక ముందు ఎంత బంగారం తరలించారు అనేది తేల్చే పనిలో పడ్డారు. ఆమెకు పోలీసులు సహకారం కూడా పెద్ద ఎత్తున ఉందని అనుమానాలు ఉన్నాయి.

దుబాయ్ నుంచి బంగారాన్ని తరలిస్తూ బెంగళూరు ఎయిర్ పోర్టులో ఆమె పట్టుబడ్డారు. ఆమె ఆమె నుంచి ఏకంగా 15 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఆమె తరచూ దుబాయ్‌ వెళ్లి వస్తుండడంతో అధికారులు నిఘా పెట్టారు. గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్‌ వెళ్లొచ్చిన రాన్యా గోల్డ్‌ బిస్కెట్లను దుస్తుల్లో దాచి, తీసుకొచ్చేవారు. ఈ విషయాన్ని డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. అయితే.. ఈ సారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పోలీసులు ప్లాన్ వేసి అరెస్ట్ చేశారు.

కర్ణాటకకు చెందిన ఓ పోలీసు అధికారికి రాన్యా బంధువని తెలుస్తోంది. డీఆర్‌ఐ అధికారులు ప్రశ్నించగా.. తాను డీజీపీ కుమార్తెనని చెప్పింది. అంతేకాదు.. ఇంటికి డ్రాప్‌ చేయడానికి ఆమె పోలీసులకు కాల్‌ చేసినట్టు కూడా గుర్తించారు. దీంతో పోలీసుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోంది.

తరవాత కథనం