టాలీవుడ్ మిల్కీ బ్యూటీ- బాలీవుడ్ హీరో విజయ్ వర్మ గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు టాక్. ఈ నేపథ్యంలోనే ఈ జంట విడిపోయినట్లు తెలుస్తోంది. కొన్ని కారణాలవల్ల ఈ జంట స్నేహితులుగా మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరు విడిపోయి ఏ బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నారోఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేష్ సహా ఇంక ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక స్టార్డం అందుకుంది.
ఇక గత కొంతకాలంగా తమన్న టాలీవుడ్కు దూరమైంది. ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ పలు సినిమాల్లో చేసింది. అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సమయంలోనే బాలీవుడ్ హీరో విజయవర్మతో ప్రేమలో పడింది. అక్కడినుంచి వీరిద్దరి వార్తలు నెట్టెంట జోరుగా సాగాయి.
వీరిద్దరూ పలు ఫంక్షన్లు, ఈవెంట్లకు కలిసి హాజరయ్యారు. అంతేకాకుండా హోటల్, రెస్టారెంట్స్ ఎక్కడ చూసినా వీరిద్దరే కనిపించేవారు. దీంతో వీరి రిలేషన్ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. త్వరలో ఈ లవ్ కపుల్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఏడాదే ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోబోతున్నారని టాక్ వినిపించింది.
ఈ నేపథ్యంలో ఈ జంట విడిపోయినట్లు తాజాగా ఓ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. వీరిద్దరూ ఇకపై కలిసి జీవించకూడదని, విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రేమ బంధానికి స్వస్తి పలికి స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. స్నేహబంధంతో ఎవరి వృత్తి పనుల్లో వారు బిజీగా ఉండాలని ఒకరినొకరు అనుకున్నారట. ఈ కారణం తోనే వారు తమ పనిపై దృష్టి పెట్టనున్నారని తెలిసింది. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.