team india: కంగారూలను వేటాడి ఫైనల్‌కు భారత్.. ప్రత్యర్థి ఎవరో!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. ప్రతి బాల్ ను టచ్ చేసి సింగల్ డబల్ పరుగులతో కంగారులను కంగారు పెట్టించాడు.

మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసి అలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవెన్ స్మిత్ అదరగొట్టేశాడు 96 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అలాగే అలెక్స్ కేరి 57 పంతుల్లో 61 పరుగులు చేశాడు. మొత్తంగా ఆసీస్ 264 పరుగులు చేసింది. ఈ లక్ష్య చేధనకు దిగిన భారత్ మొదటి నుంచి మంచి ఫామ్ కనబరుస్తూ వచ్చింది.

ఓపెనర్స్ గా దిగిన రోహిత్, శుభమన్ గిల్ ఓ 30 పరుగుల వరకు బానే ఆడారు.. కానీ ఆ తర్వాత ఎక్కువ సమయం క్రీజ్ లో ఉండలేకపోయారు. తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. ఆ తర్వాత దిగిన విరాట్ కోహ్లీ చాలా సహనంతో బాల్ టు బాల్ సింగిల్ చేస్తూ వచ్చాడు. ఎక్కడ వెనకడుగు వేయకుండా భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

98 బంతుల్లో 84 పరుగులు చేసి ఔరా అనిపించాడు. కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా అదరగొట్టేసాడు. 62 బంతుల్లో 45 పరుగులు చేశాడు. శ్రేయస్ అయిన తర్వాత అక్షర్ పటేల్ కూడా దుమ్ము దులిపేశాడు. అయితే విరాట్ కోహ్లీ, అక్షర పటేల్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కేఎల్ రాహుల్ మెల్ల మెల్లగా విజయ తీరాల వరకు తీసుకెళ్లాడు.

అక్కడినుంచి హార్దిక్ పాండ్యా విజయాన్ని ఖరారు చేశాడు. సిక్సర్లతో అధరకొట్టేసాడు. మొత్తంగా టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య సెమి ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు విన్ అయితే అది భారత్ తో తలపడనుంది.

తరవాత కథనం