Headaches: తలనొప్పని నిర్లక్ష్యం చేస్తున్నారా.. జాగ్రత్త ఈ ప్రమాదకర వ్యాధి లక్షణాలు కావచ్చు

Headaches

Headaches: ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. పని ఒత్తిడి, కుటుంబ భాధ్యతలు ఇతర సమస్యల వల్ల తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అయితే తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్యే.. అది ఏదో ఒక టైమ్‌లో వస్తూనే ఉంటుంది. కంటినిండ నిద్రలేనప్పుడు, వాతావారణంలో మార్పులు వల్ల తలనొప్పి వస్తుంటుంది. అయితే ఈ సమస్య రెగ్యులర్‌గా ఉంటే మాత్రం.. అనేక వ్యాధి లక్షణాలకు కారణం కావచ్చు. దీనిని అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుధీర్ఘ కాలం తలనొప్పిగా ఉంటే అనేక వ్యాధుల లక్షణాలు కావచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మైగ్రేన్
ప్రస్తుత జీవనశైలి కారణంగా ఎంతో మంది ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వాటిలో మైగ్రేన్ కూడా ఒకటి. కాస్త పని ఒత్తిడి ఎక్కువగా అవ్వగానే తీవ్రమైన తల నొప్పి మొదలవుతుంది. దీంతో రోజు వారి పనులను చేసుకోవడంలో కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మైగ్రేన్‌ తలనొప్పినే పార్శ్వనొప్పి అని కూడా అంటారు. మైగ్రేన్‌తో బాధపడే వారిలో ముఖ్యంగా తలలో ఒకవైపు మాత్రమే నొప్పి ఉంటుంది. ఈ తలనొప్పి ఆడవారిలో ఎక్కువగా వస్తుంది. మైగ్రేన్ ఉన్న వాళ్లు చీజ్, నట్స్, ధూమపానం, మద్యపానంకు దూరంగా ఉండాలి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం, యోగా, మెడిటేషన్ వంటి చేయాలని నిపుణులు సూచుస్తున్నారు.

సైనసిటిస్ వ్యాధి..
సైనసిటిస్ అనేది చాలా సాధారణ వ్యాధి. దీనిలో సైనస్ లైనింగ్ ఎర్రబడుతుంది. ఇది సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది కూడా తలనొప్పికి కారణమవుతుంది. సైనసిటిస్ వ్యాధిని మందులతో నియంత్రించవచ్చు. తరచుగా రెండు లేదా మూడు వారాల్లో మెరుగుపడుతుంది.

అధిక రక్తపోటు లక్షణాలు..

ఇది చాలా డేంజర్.. ఎందుకంటే.. ఈ వ్యాధి లక్షణాలను అంత ఈజీగా గుర్తించలేము. మీరు కూడా చాలా రోజుల నుంచి తలనొప్పితో బాధపడుతుంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. అది రక్తపోటుకు కారణం కావచ్చు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

మెదడు కణితి
ప్రాథమిక ప్రాణాంతక మెదడు కణితి.. మెదడులోనే ఉద్భవించే ఒక రకమైన క్యాన్సర్. ఇది కూడా తలనొప్పికి కారణమవుతుంది. తలనొప్పితో పాటు, తలతిరగడం, దృష్టి మసకబారడం ఇతర లక్షణాలు కనిపిస్తాయి. దీనికి కూడా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.

తరవాత కథనం