Health Benefits of Sapota: మనకు ప్రకృతి పరంగా సహజ సిద్దంగా లభించే పండ్లలలో సపోటా ఒకటి. ఇది అధిక పోషకాలు ఉన్న పండు. దీనిని తరుచూ తినడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే గ్లూకోజ్ శరీరానికి శక్తిని అందిస్తుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్, అనేక రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీని రుచి తియ్యగా ఉండటం వల్ల జ్యూస్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సపోటా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సపోటా శరీరానికి తక్షణ గ్లోకోజ్‌ని అందించడంలో సహాయపడుతుంది. సపోటాలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ వృద్యాప్యంలో కూడా కంటి చూపును మెరుగుపరిచేలా సహాయపడుతుంది. సపోటా టన్నెన్‌ని అధికంగా ఉంటాయి. మధ్య వయస్కులు తరుచూ సపోటా పండు తినడం వల్ల కంటి రుగ్మతకు గురికాకుండా ఉండవచ్చు.
సపోటాలో ఫాస్పరస్, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఎముకల గట్టితనానకి ఎంతో సహాయం చేస్తాయి. సపోటాలో పీచు పదార్దం అధికంగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. ఇందులో అధిక శాతం కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. స్త్రీలు ప్రెగ్నెన్సీ సమయంలో సపోటాను తీసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు. సపోటాలు తినడం వల్ల వికారం తగ్గుతుంది. సపోటా ఉడికించిన నీళ్లు తాగడం వల్ల డయేరియాను అదుపులో ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
సపోటా తినడం వల్ల శ్లేష్మం శరీరం నుండి బయటకు వస్తుంది. జలుబు, దగ్గు తగ్గిపోతాయి. దీంతో పాటు ఒత్తిడిని తగ్గించే గుణం సపోటాలో పుష్కలంగా ఉంది. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేనా దంతాల ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. అలాగే సమ్మర్‌లో సపోటాను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.