ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రెండో సెమీఫైనల్ మ్యాచ్ బుధవారం దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠగా జరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. మార్చి 9వ తేదీన భారత్ తో తలపడనుంది.
మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ అదర కొట్టేసారు. ఇద్దరూ చెరో సెంచరీలతో చెలరేగిపోయారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ లోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన టీముగా న్యూజిలాండ్ నిలిచింది.
రచిన్ రవీంద్ర 101 బంతుల్లో 108 పరుగులు చేసి అద్భుతమైన ఆట తీరు కనబరిచాడు. అందులో 13 ఫోర్లు, ఒక సిక్స్ తో అదరగొట్టేసాడు. కెన్ విలియంసన్ 94 బంతుల్లో 102 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అందులో 10 ఫోర్లు, రెండు సిక్స్ లు ఉన్నాయి. వీరికి తోడు గ్లెన్ ఫిలిప్స్ 49 పరుగులు, డెరిల్ మిచెల్ 49 పరుగులతో మెరవడంతో కివీస్ భారీ స్కోరు చేసింది.
ఇక ఈ టార్గెట్ ను చేదించేందుకు దిగిన సౌత్ ఆఫ్రికా చేతులెత్తేసింది. 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. మొదట్నుంచి బానే ఆడేంది. ఒక వికెట్ కూడా పడకుండా జాగ్రత్తగా ఆచితూచి ఓపెనర్లు పరుగులు రాబట్టారు. కానీ 120 పరుగులు దాటిన తర్వాత ఓపెనర్లు ఔట్ అయిపోవడంతో మ్యాచ్ కష్టంగా మారింది.
సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో మిల్లర్ అద్భుతంగా రాణించాడు. 67 బంతుల్లో 100* పరుగులు చేసి అదరగొట్టేసాడు. అలాగే వండర్ డసేన్ 69 పరుగులు, బౌవుమా 56 పరుగులతో రాణించారు. ఇక ఈ మ్యాచ్లో కివీస్ నిర్దేశించిన పరుగులను ఛేదించలేక సౌత్ ఆఫ్రికా జట్టు సతికిళ్ళపడింది. ఆదివారం జరగనున్న ఫైనాన్స్లో న్యూజిలాండ్ తో భారత్ ఢీ కొంటుంది. చూడాలి మరి ఆ రోజు మ్యాచ్ ఏ రేంజ్ లో ఉంటుందో.