Coconut oil For White Hair: ఈ రోజ్లులో తెల్లజుట్టు సమస్యలతో ప్రతి ఒక్కరు సతమతమవుతున్నారు. దీనికి దుమ్మూ, ధూళి, స్ట్రెస్, ఇతర కారణాలు కావచ్చు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికే పలు రకాల హెన్నాలు, హెయిర్ డైలు, షాంపులు ఉపయోగిస్తుంటారు. ఇవి కెమకల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి జుట్టుకు హాని కలిగే ప్రమాదం ఉంది.
అంతే కాదు వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యలు, కంటికి సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లోనే నాచురల్‌గా కొబ్బరి నూనెతో వీటిని కలిపి హెయిర్ మాస్క్‌లు తయారు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తెల్లజుట్టు రావడం ఆగిపోతుంది. అంతే కాదు వీటివల్ల జుట్టు పొడవుగా పెరగడంతో పాటు, చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
కొబ్బరి నూనె
మెంతులు
కలోంజీ సీడ్స్
గోరింటాకు పొడి
తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో రెండు కప్పుల కొబ్బరి నూనె, అందులో అరకప్పు మెంతులు, అరకప్పు కలోంజీ సీడ్స్, గోరింటాకు పొడి వేసి బాగా నల్లగా వచ్చేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్లకు అప్లై చేసి.. అరగంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి.
ఇలా నెలకు రెండు సార్లు చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు కూడా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇందులో ఉపయోగించే పదార్ధాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.