Singer Kalpana: ఒత్తిడి వల్లే నిద్రమాత్రలు తీసుకున్నాను -సింగర్ కల్పన

Singer Kalpana Exclusive Video

Singer Kalpana: ఆత్మహత్య యత్నమా? ఆందోళన నుంచి బయటపడేందుకు వేసుకున్న నిద్రమాత్రల ఓవర్ డోస్‌తోనా? రిజన్ ఏమైనా.. సింగర్ కల్పన ఇష్యూ తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. అసలు కల్పనకు ఏమైంది. ఎందుకు దీన స్థితిలో ఎందుకు కల్పించింది. ఇలా ఎన్నో ప్రశ్నలు అందరిని కలిచివేశాయి. అయితే ఈ ఇష్యూలో పోలీసులు మాత్రం కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదంటూ తమకు స్టేట్‌మెంట్ ఇచ్చిందని ప్రకటించారు. కూతురు విషయంలో కాస్త డిస్ట్రర్బ్‌గా -ఉన్నానని.. అందుకే నిద్రపోయేందుకు మాత్రలు వేసుకున్నానని.. అది కాస్త ఓవర్ డోస్ కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పినట్లు తెలిపారు.

సింగర్ కల్పన నిజాంపేటలోని ఓ విల్లాలో భర్తతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 3న కూతురు దయప్రసాద్‌, కల్పన మధ్య చదువు విషయంలో కాస్త డిస్కషన్ జరిగింది. హైదరాబాద్‌లో చదువుకోవాలని కల్పన కోరగా.. దయ ప్రసాద్ అందుకు నిరాకరించింది. ఆ తర్వాతి రోజు హైదరాబాద్‌కు చేరుకుంది కల్పన. అదే డిస్ట్రబెన్స్‌లో ఉన్న కల్పన.. నిద్రపట్టడం లేదని నిద్రమాత్ర వేసుకుంది. అయితే ఎంతకీ నిద్ర రాకపోవడంతో మరిన్ని మాత్రలు వేసుకుంది. ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదు అని పోలీసులకు తెలిపింది కల్పన. హాస్పిటల్‌లో స్పృహ రాగానే అసలేం జరిగిందో మొత్తం పోలీసులకు వివరించింది కల్పన. తాను ఎటువంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని.. ఈ ఇష్యూలో ఎవరి ప్రమేయం లేదని పోలీసులకు క్లారిటీ ఇచ్చింది. నిద్ర మాత్రలు ఎక్కువగా వేసుకోవడమే దీనంతటికి కారణమంటోంది కల్పన.

ఇటు సింగర్ కల్పన ఆత్మహత్యయత్నంపై ఆమె కూతురు దయ ప్రసాద్ ప్రభాకర్ కూడా రియాక్ట్ అయ్యారు. కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుందని అసత్య ప్రచారం జరుగుతోందన్నారు ఆమె. అసలు అమ్మ ఆత్మహత్యయత్నం చేయలేదని.. డాక్టర్ల సూచన మేరకు వాడుతున్న టాబ్లెట్స్ ఓవర్ డోస్ కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అసలు తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని.. కొన్ని రోజుల్లో కల్పన ఆరోగ్యంగా తిరిగి వస్తుందని చెబుతున్నారు దయ ప్రసాద్.

అయితే తాజాగా.. ఒత్తిడి వల్లే నిద్రమాత్రలు తీసుకున్నాని సింగర్ కల్పన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన భర్త ఎలాంటి విభేదాలు లేవన్నారామె. తాను ప్రాణాలతో ఉన్నానంటే కారణం తన భర్త, కూతురే కారణమన్నారు కల్పన. తన గురించి జరిగే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారామె. సరైన సమయంలో తన భర్త పోలీసుల్ని అలర్ట్ చేశారని.. కాబట్టే బతికానంటూ కల్పన సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చారు.

తరవాత కథనం