Alum for skin: ప్రతి ఒక్కరికి ముఖంపై, మొటిమలు రావడం సహజం. కానీ అవి కొన్ని సార్లు మచ్చలుగా ఏర్పడి అందవిహీనంగా కనిపిస్తారు. వీటిని తగ్గించుకునేందుకు బయట మార్కెట్లో రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ఇవి కెమికల్స్‌తో నిండి ఉంటాయి కాబట్టి చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి నాచురల్ పదార్ధాలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మొటిమలు, మచ్చలు తొలగించేందుకు పటిక చక్కగా ఉపయోగపడుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మానికి పటిక ఉపయోగాలు
-ఆయుర్వేదం ప్రకారం.. పటిక చర్మ సౌందర్యానికి సహజమైన పదార్ధం. దీన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తే.. ముఖంపై మచ్చలు, మొటిమలు, పిగ్మింటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది.
-పటికలో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను ఎదిరించి వాటిని తొలగించడంలో సహాయపడుతుంది.
-పటికలో ఆస్ట్రిజెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాల్లో ఉండే మురికిని, అదనపు నూనెను తొలగించి, మొటిమలు రాకుండా సహాయపడుతుంది.
-పటిక చర్మంపై మృతకణాలను తగ్గించి, కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అంతేకాదు.. చర్మాన్ని తెలుపు రంగులోకి మార్చేందుకు ఉపయోగపడుతుంది.
పటిక, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
పటికను పొడి చేసుకుని, అందులో రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసుకోండి. 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.
పటిక, కొబ్బరి నూనె ఫేస్ ప్యాక్
రెండు టీ స్పూన్లు పటికను, కొబ్బరి నూనెతో కలపి, ఇయర్ బడ్ సహాయంతో మొటిమలు, మచ్చలు ఉన్న దగ్గర అప్లై చేయండి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గిపోయి.. ఫేస్ చాలా అందంగా కనపిస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.