Watermelon: ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయ తింటే అంత డేంజరా..?

Watermelon

Watermelon: ఎండాకాలం వచ్చిందంటే చాలు దాదాపు ప్రతి ఇంట్లో పుచ్చకాయ ఉంటుంది. సమ్మర్లో లభించే పండ్లలో వాటర్ మిలన్ ఒకటి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా పుచ్చకాయలో ఉండే పోషకాలు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాని వాటర్ మిలన్ ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మరి పుచ్చకాయను ఎందుకు ఫ్రిజ్‌లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటివల్ల శరీరంలో షుగర్ స్థాయి నియంత్రించబడుతుంది. దీనిని జ్యూస్‌లలో కూడా తీసుకోవచ్చు. పుచ్చకాయలో సుమారు 90 శాతం నీరు ఉంటుంది. ఎలక్ట్రోలైట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే పీచు పదార్ధం ఆకలిని నియంత్రిస్తుంది. వాటర్ మిలన్‌లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

అయితే ఎక్కువ మంది పుచ్చకాయను తెచ్చిన తర్వాత కట్ చేసి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇలా చేసినట్లైతే వాటర్ మిలన్‌లో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అందులో ఉండే కెరోటినాయిడ్స్ స్థాయి కూడా తగ్గిపోతుంది. పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత తింటే. విటమిన్ ఎ, సి వంటి ముఖ్యమైన పోషకాలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటర్ మిలన్‌లో 90 శాతం వరకు నీరు ఉంటుంది. కట్ చేసిన వెంటనే తింటే శరీరానికి అందుతుంది. అయితే ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు పుచ్చకాయ తింటే.. తేమతో బ్యాక్టీరియా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అది అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇలా ఫ్రిజ్‌లో పెట్టినవి చిన్నపిల్లలకు అస్సలు ఇవ్వొద్దు. కడుపులో నొప్పి, విరోచనాలు అయ్యే  అవకాశాలు ఉన్నాయి.

చల్లగా ఉండే పుచ్చకాయ తింటే.. దగ్గు, జలుబు చేసే అవకాశం ఉంది. చాలా సేపు ఫ్రిజ్‌లో పెట్టడం వల్లన పుచ్చకాయ ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఫ్రెష్ వాటర్ మిలన్ తింటే మంచిది. పుచ్చకాయను 15 రోజుల నుంచి 20 రోజుల వరకు బయట నిల్వ చేయవచ్చు. కోసిన వెంటనే తినడం మంచిది. పుచ్చకాయను పూర్తిగా తినలేకపోతే దానిని జ్యూస్ చేసుకుని తాగడం ఉత్తమం.

తరవాత కథనం