Women’s Day Special: యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః స్త్రీ ఎక్కడ గౌరవింప బడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అమ్మగా, అక్కగా, ఆలిగా తనపాత్రను ఎంతో ఓర్పుతో, నేర్పుతో చాలా చాకచక్యంగా కుటుంబ వ్యవస్థను ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్న ఓ మహిళా మూర్తి నీకు వందనం..
కనులు తెరిచిన క్షణం నుండి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరిని కనుపాపలా కాపాడే ఓ గొప్ప దయా హృదయి స్త్రీ.. విశ్వమంతటా అన్ని రంగాల్లో మగవానికి ధీటుగా తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ.. తాము ఏ రంగంలోనూ తక్కువ కాదని, ప్రపంచానికి సవాళ్లు విసురుతూ.. ముందుకు పోతున్న విధానం ఉందే.. ఓ నారి.. నీకు సలాం..
స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు, సృష్టిలో జీవం లేదు.. అసలు సృష్టే లేదు. స్త్రీ శక్తి అపారం, ఆమె యుక్తి అమూల్యం. తల్లిగా, చెల్లిగా, తోడుగా ఆమె పాత్ర అనితర సాధ్యం. ఆమె లేకుంటే జగత్తు సూన్యం. ఒక ధీర వనిత ఝాన్సీ లక్ష్మీ భాయ్ కావచ్చు, సేవా దృక్పథంతో ముందుకు సాగిన ఒక మదర్ థెరిస్సా, ఒక ఐపీఎస్ కిరణ్ బేడి, సరోజినీ నాయుడు, ఇందిరా గాంధీ, కల్పనా చావ్లా వీళ్లందరు నేటి యువతకు ఎంతో ఆదర్శం. మహిళలు ఆర్ధిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎంతగానో సేవలందుస్తూ.. సవాళ్లను ఎదుర్కుంటూ ముందుకు సాగిపోతూ ఔరా అనిపించుకుంటున్న ప్రితీ మహిళా మూర్తికి మహిళా దినోత్సవ సుభాకాంక్షలు.
తమకు అవకాశాలు ఇస్తే ఏ రంగంలో కూడా తక్కువ కాదని, అంతకంటే ఎక్కువే ప్రతిభ చూపించగలమని, సవాళ్లను సైతం చూపించి ముందుకు నడిపించగలమని, నిరూపించిన వీరమణులు చాలా మందే ఉన్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు.
మరి రెండో వైపు.. నేటికి స్త్రీల పట్ల మానభంగాలు, మర్డర్లు, అఘాయిత్యాలు, స్త్రీ వివక్షత ఎంతో కలవరపరిచే అంశాలు. మనం ఇంకా నాగరిక ప్రపంచంలో ఉన్నామా..? లేక అనాగరిక ప్రపంచంలో ఉన్నామా..? అనేందుకు కొన్ని సంఘటనలు మనల్ని కలవరపెడుతున్నాయి. అందులో ఆయేషా, నిర్భయ, దిశ, ఇటీవల కేరళలో డాక్టర్‌పై జరిగిన సంఘటన, ఇలా ఎందరో జీవితాలు కొందరు మానవమృగాల చేతులో అశువులుబాసిన అక్క, చెల్లెమ్మలకు నేటి సమాజం ఏమని సమాధానం చెప్పాలి.
నేటికి నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చిన, ఇలాంటి సంఘటనలు ఇంకా జరగడం దురదృష్టకరం. అయితే చట్టాలు తన, మన అనే బేధాలు లేకుండా కఠినంగా అమలు కావాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. ఇంకొక దురదృష్టకరం ఏంటంటే ప్రసార సాధనాలు.. వచ్చే సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు. స్త్రీని, మరొక స్త్రీ యొక్క సంబంధాలు మంచిగా చూపించడంలేదని అనిపిస్తుంది. స్త్రీ మరొక స్త్రీ అవమాన పరచడం, చులకన చేసుకోవడం, పగా ప్రతీకారాలు ఇలాంటి క్యారెక్టర్సే తప్పా.. స్త్రీ పాత్రను ఒక ఇన్స్ప్రేషనల్‌గా, మోటివేషనల్ గా చూపించడంలేదు.
స్త్రీ ఔనత్యాన్ని, త్యాగాన్ని కాని వాళ్లు ఎదుర్కుంటున్న సమస్యలను గాని, సవాల్లను కానీ.. ఎలా అధికమించారు. ఎలా అధికమిస్తున్నారు.. ఎలా అధికమించాలి.. అని చూపించే క్యారెక్టర్స్ రావడం లేదనే చెప్పాలి. అలాగే చట్టసభల్లో స్త్రీకి తగినంత ప్రాతినిధ్యం లేదనే చెప్పాలి. స్త్రీకి 50 శాతం అన్ని సభల్లో ప్రాతినిధ్యం ఎప్పుడు వస్తుందో అప్పుడే స్త్రీకి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టుగా భావించాలి. స్త్రీలు శారీరకంగా ధృఢత్వం కాకపోవచ్చు.. కానీ మానసికంగా చాలా చాలా ధృఢత్వం కలవారు. మన పురాణాల సైతం స్త్రీని ఒక శక్తిగానే చెప్తారు. స్త్రీ శక్తి ఒక అపారం.. స్త్రీ శక్తి ఒక అమోఘం.. స్త్రీ శక్తి అనిర్వచనీయం. జయహో వీరవనిత.. జై జై జైహింద్..