Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’ నుంచి షాకింగ్ న్యూస్.. ఆందోళనలో ఫ్యాన్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగా దర్శకుడు మారుతితో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పట్టాలెక్కి చాలా నెలలు గడుస్తుంది. కానీ ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకోలేదు. కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ స్లోగా జరుగుతూ వస్తుంది.

కల్కి మూవీ తర్వాత ఈ సినిమా షూటింగ్ వేగవంతం చేశారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఎలా లేదన్నా సమ్మర్ ఆఖరు వరకు అయినా ఈ సినిమాని రిలీజ్ చేస్తారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఈ తరుణంలో రాజా సాబ్ కి సంబంధించి ఓ గాసిప్ బయటికి వచ్చి అభిమానులను ఆందోళనలో పడేసింది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను రీ షూట్ కి ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా సాగుతున్నాయి.

దీని కారణంగా దాదాపు నెలరోజుల పాటు అదనంగా షూటింగ్ కి సమయం కేటాయించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ గాసిప్స్ నెట్టింట వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన ఈ సినిమా ఇప్పుడు రీ షూట్ అంటే మరింత లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు మాత్రం దర్శకుడు మారుతి ఈ సినిమా షూటింగ్ చాలా స్లోగా చేస్తున్నాడని.. అందువల్లనే చాలా లేట్ అవుతుందని ఎవరూ కంగారు పడవద్దని చెప్పుకొస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

తరవాత కథనం