White Hair Tips: ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే.. నిమిషంలో మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది తెలుసా?

White Hair Tips

White Hair Tips: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు రావడం కామన్ అయిపోయింది. ఇందుకు దుమ్మూ, ధూళి, కాలుష్యం వల్ల గాని, ఒత్తిడికి గురవ్వడం, సరైన ఆహారం తినకపోవడం, కొంత మందికి వంశపార్యపరంగా వస్తుంది. అయితే తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు చాలా మంది రకరకాల హెయిర్ డైలు, షాంపులు, హెన్నాలు ట్రై చేస్తుంటారు. అవి కొద్దిరోజులు మాత్రమే పని చేస్తాయి.

పైగా ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి.. జుట్టుకు హాని కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్స్ట్ లేకుండా ఇంట్లోనే నాచురల్‌గా తయారు చేసుకున్నారంటే.. జీవితంలో తెల్లజుట్టు రాదు. కాబట్టి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు
ఆవాలు
కరివేపాకు
మెంతులు
కొబ్బరి నూనె

తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో కావాల్సినన్ని ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసి బాగా నల్లగా వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీజార్‌లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడి కొద్ది రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని చిన్న బౌల్‌లో తీసుకుని అందులో కొబ్బరి నూనె కలిపి తలకు అప్లై చేయండి.

అరగంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా రెండు వారాలకు ఒకసారి చేస్తే క్రమంగా తెల్లజుట్టు రావడం ఆగిపోతుంది. ఇందులో పదార్ధాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇవి జుట్టు పెరుగుదలకు, చుండ్రును తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.

తరవాత కథనం