Glowing Skin Tips: పచ్చిపాలతో మీ అందం రెట్టింపు.. మీ చర్మం మిలమిల మెరిసి పోవాలంటే..ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

Glowing Skin Tips: పాలు ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికి తెలిసిందే.. కానీ పాలతో చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాలతో ఇలాంటి ఫేస్ ప్యాక్‌లు ట్రై చేశారంటే.. మంచి ఫలితం ఉంటుంది. పాలను ముఖానికి అప్లే చేస్తే.. చర్మంపై మురికి, మచ్చలు, మృతు కణాలను తొలగిపోయి కాంతివంతంగా, మెరిసేలా చేస్తుంది. అంతే కాదు ముఖంపై మొటిమలు, బ్లాక్ హెడ్స్‌ను కూడా తొలగించి మిమ్మల్ని పాలరాతి బొమ్మలా తయారు చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం పచ్చిపాలతో ఫేస్ ప్యాక్‌లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలు, బియ్యంపిండి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ పాలు, రోజ్ వాటర్ కలిపి ముఖంపై అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గించి కాంతి వంతంగా మెరుస్తుంది.

పచ్చిపాలు, బొప్పాయి ఫేస్ ప్యాక్
చిన్న గిన్నెలో బొప్పాయి గుజ్జు తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ పచ్చిపాలు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రోజు మార్చి రోజు చేస్తే.. ముఖం తెల్లగా మారుతుంది.

పాలు, తేనె ఫేస్ ప్యాక్
చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ పచ్చిపాలు, తేనె కలిపి ముఖానికి పట్టించండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. ముఖంపై బ్లాక్ హెడ్స్ తొలగిపోయి మిలమిల మెరుస్తుంది.

పచ్చి పాలు, నట్స్ ఫేస్ ప్యాక్
ఇందుకోసం.. పచ్చిపాలల్లో బాదం వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు మెత్తగా పేస్ట్ చేసుకుని ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత సాధారణ నీటితో ముఖానికి శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే.. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.

తరవాత కథనం