Singer Kalpana: మహిళా కమిషన్ చైర్ పర్శన్ నేరెళ్ల సారదను కలిశారు సింగర్ కల్పన. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో వార్తలు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. తన ప్రైవేట్ వీడీయోలతో ట్రోల్స్ చేస్తున్నారని కూడా కంప్లైంట్ ఇచ్చారు. కల్పనకు కొందరు సింగర్స్ కూడా మద్దతుగా నిలిచారు. అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నిజాంపేటలో వర్టెక్స్ ప్రివిలేజ్‌లోని తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను పోలీసులు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే..
అయితే ఇటీవల సింగర్ కల్పన తాను ఒత్తిడి వల్లే నిద్రమాత్రలు తీసుకున్నాని చెబుతూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తన భర్త ఎలాంటి విభేదాలు లేవన్నారామె. తాను ప్రాణాలతో ఉన్నానంటే కారణం తన భర్త, కూతురే కారణమన్నారు కల్పన. తన గురించి జరిగే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సరైన సమయంలో తన భర్త పోలీసుల్ని అలర్ట్ చేశారు కాబట్టే బతికానంటూ కల్పన సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వారు సింగర్ కల్పన పరిస్తితిపై కుప్పలు తెప్పలుగా కథనాలు వచ్చాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్తలు రాసుకొచ్చారు. ఈ తరుణంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్శన్ నేరెళ్ల సారదను కలిసి ఫిర్యాదు చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని మహిళా ఛైర్ పర్శన్ కల్పనకు హామీ ఇచ్చారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై ప్రత్యేక శ్రద్ద పెట్టామని తెలిపారు. ఇష్టం వచ్చినట్లు పోస్ట్‌లు కానీ, వార్తలు కానీ రాస్తే.. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.