Gautam Gambhir: జడేజా విలువ తెలుసు.. మాకెవరూ చెప్పనవసరం లేదు: గంభీర్

టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలామంది జడేజాను తక్కువ అంచనా వేస్తున్నారని.. కానీ అతడు ప్రపంచంలోనే బెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడని కొనియాడాడు. జడేజా విలువ ఎవరికి తెలియకపోయినా అతడి విలువ భారత డ్రెస్సింగ్ రూమ్ కు తెలుసని అన్నాడు.

అయితే జడేజా గురించి మనం పెద్దగా ఎప్పుడూ మాట్లాడుకోమని తాను అనుకుంటున్నాట్లు పేర్కొన్నాడు. అతడు భారత క్రికెట్కు ఎంతో సేవ చేశాడని.. భారత క్రికెట్ జట్టుకు జడేజా చాలా కీలకమని చెప్పుకొచ్చాడు. అతడు మూడు ఫార్మాట్లలో రాణించిన ఆల్ రౌండర్ అని కొనియాడాడు. బ్యాటరుగా, బౌలర్ గా మాత్రమే కాకుండా ఫీల్డర్ గాను అద్భుతమైన ప్రదర్శన చేస్తాడని చెప్పుకొచ్చాడు.

అందువల్లే ప్రపంచంలోనే బెస్ట్ ఆల్రౌండర్లలో జడేజా ఒకడని పేర్కొన్నాడు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీలో అతడు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడని తెలిపాడు. అయితే వికెట్లు ఎక్కువగా పడగొట్టకపోయినా రన్స్ ఆపడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడని చెప్పాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడగా.. 4.78 ఎకానమీతో నాలుగు వికెట్లు తీశాడని తెలిపాడు.

అదే సమయంలో అక్షర పటేల్ బ్యాటింగ్ ఆర్డర్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్సర్ పటేల్ ఐదవ స్థానంలో రావడంపై ఇప్పటికే పలువురు మాజీలు తప్పుపట్టారు. ఈ విషయంపై గంభీరు స్పందించాడు. ఎవరేమనుకున్నా తాము పట్టించుకోమని అన్నాడు. అక్సర్ పటేల్ సత్తా తమకు తెలుసు అని అతడ్ని అయిదవ స్థానంలోనే కొనసాగిస్తామని తెలిపాడు.

అలాగే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏ స్థానంలో ఆడుతున్నాం అనేది ముఖ్యం కాదని.. ఏ మేరకు ప్రభావం చూపుతున్నామనదే అవసరమని తెలిపాడు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా నడుచుకోవాలని.. దానిని కేఎల్ రాహుల్ సంతోషంగా చేస్తున్నాడని కొనియాడాడు.

తరవాత కథనం